Home » బ్లాక్ బస్టర్ “ప్రేమికుడు” సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్….ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

బ్లాక్ బస్టర్ “ప్రేమికుడు” సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్….ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

by AJAY
Ad

మనదేశం లోని గొప్ప దర్శకులలో తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఒకరు. శంకర్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు వచ్చాయి. ఒకప్పుడు అర్జున్ హీరోగా శంకర్ దర్శకత్వంలో జెంటిల్ మెన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చగా ప్రభుదేవా స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేశారు. చికుబుకు చికుబుకు రైలే అంటూ సాగే పాటలో ప్రభుదేవా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి: గుర్తు పట్టలేనంత మారిపోయిన మహేష్ బాబు చెల్లెలు….ఇప్పుడు ఎక్కడ ఉందో…ఏం చేస్తుందో తెలుసా…!

Advertisement

ఇవి కూడా చదవండి: విఘ్నేష్ శివన్ నయనతారల మధ్య లవ్ ఎప్పుడు మొదలైందో మీకు తెలుసా..?

ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడంతో నిర్మాత కుంజుమన్… శంకర్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. దాంతో శంకర్ ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు అనే సినిమా కథను నిర్మాతకు వినిపించారు. సినిమాలో హీరో గవర్నర్ కూతురును ప్రేమిస్తాడు. కథ నచ్చడంతో నిర్మాత కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్ ప్రారంభించారు.

Advertisement

అయితే ప్రేమికుడు సినిమాలో గవర్నర్ కుట్రలు… కుతంత్రాలు చేస్తాడని అదే సినిమాకు థీమ్ అనే విషయం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి చేరింది. అప్పుడు గవర్నర్ గా చెన్నారెడ్డి ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. కాగా ఈ సినిమాను ఆపివేయాలని సినిమాలో గవర్నర్ కు సంబంధించిన సన్నివేశాలను తొలగించాలని గవర్నర్ చెన్నారెడ్డి కార్యాలయం నుండి నిర్మాత కు బెదిరింపులు వెళ్లాయట. దాంతో నిర్మాత కుంజుమన్ ఈ విషయాన్ని సీఎం జయలలిత దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో జయలలిత సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు లేకుండా తీసుకోవాలని పర్మిషన్ ఇచ్చారు. సీఎం పర్మిషన్ ఇవ్వడం తో ప్రేమికుడు సినిమా పట్టలెక్కి చక చకా షూటింగ్ పూర్తయ్యింది. ఆ తరవాత సినిమా చూసిన జయలలిత కూడా సంతోషంగా ఫీల్ అయ్యారట. అలా గవర్నర్ అడ్డుకున్న ప్రేమికుడు సినిమా ఎన్నో ఒడిదుడుకుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యింది.
ఇవి కూడా చదవండి:
అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

Visitors Are Also Reading