తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్.. ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు జయప్రద. అప్పట్లో జయప్రద, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అభిమానులు పది చకిచపోయేవారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం జయప్రద మన తెలుగు సినిమాల్లో తప్ప వేరే భాష సినిమాలో నటిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆమెను ప్రశ్నించగా… దానికి నేను ఎన్టీఆర్ గారిని మోసం చేశాను.. ఎందుకే ఇలా మొత్తం ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆ ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చాను అని తెలిపారు.
Advertisement
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో జయప్రద మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు నాకు జీవితాల్లో పెద్ద రోల్ మోడల్. ఆయనను చూసే నేను సినీ రంగంలోకి వచ్చాను. ఆయనతో కలిసి సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చినందుకు నేను అదృష్టవంతురాలిని. అయితే ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరమని నాకు ఫోన్ చేశారు. దాంతో ఒక్క నిమిషం ఆలోచించకుండా నేను ఆ పార్టీలో చేరిపోయాను. ఆయనను సీఎం చేయాలనీ ఒకే ధ్యేయంతో ప్రచారం చేశాను. కానీ ఏవో పదవులు ఆశించలేదు. అయిన ఆయన నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు.
Advertisement
కానీ ఆ తర్వాత చంద్రబాబు పార్టీనీ తన చేతులోకి తీస్కున్నారు. అప్పుడు నేను ఎన్టీఆర్ గారితో ఉండాలి. నాతోటి లీడర్లు, ఏమ్మెల్యేలు అందరూ రాష్ట్రం కోసం అంటూ చంద్రబాబుతో కలిశారు. నేను వారితోనే వెళ్ళాను. ఆ తర్వాత మా పార్టీ గెలిచినా చంద్రబాబు ప్రజలతో… నాయకులతో నడుచుకునే తీరు నాకు నచ్చలేదు. అందుకే అందులో నుండి బయటకు వచ్చేసాను. ఆ తర్వాత నేను ఎన్టీఆర్ హరిణి మోసం చేశాను అని ఎంతో భాధ పడ్డాను. ఆ బాధకు దూరం కావడానికే ఆ ఇండస్ట్రీ నుండి ఆ రాష్ట్రం నుండి బయటకు వచ్చాను అని జయప్రద తెలిపారు.