Home » బీసీసీఐ చీఫ్ గా గంగూలీ రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన జై షా..!

బీసీసీఐ చీఫ్ గా గంగూలీ రాజీనామా.. క్లారిటీ ఇచ్చిన జై షా..!

by Azhar
Ad

భారత జట్టుకు ఓ కొత్త రూపం ఇచ్చిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అయితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షునిగా ఉన్న దాదా చేసిన ఓ ట్విట్ వైరల్ గా మారింది. అయితే ఆ ట్విట్ లో ఏం ఉంది అంటే.. ‘నేను భారత క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన 1992 నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న 2022 వరకు నా క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ క్రికెట్ నాకు జీవితంలో ఏం కావాలో అవి అన్ని ఇచ్చింది. ముఖ్యంగా నాకు లభించిన మద్దతు, ప్రేమ అనేవి వెల కట్టలేనివి. నా ఈ ప్రయాణంలో భాగమైన వారికి.. నాకు అండగా నిలిచిన అందరికి పేరు పేరున ధన్యావాదాలు. వారి సహాయ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను. అయితే ఈ రోజు నేను ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇక ముందు భవిష్యత్తు‌లో కూడా నాకు ఇటువంటి మద్దతే లభిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Advertisement

Advertisement

కానీ ఈ ట్విట్ లో దాదా ఎక్కడ కూడా తాను బీసీసీఐని గాని.. తన అధ్యక్ష పదవిని గాని వదిలేస్తున్నాను అని చెప్పలేదు. అయితే దాదా ఎప్పటినుండి రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే ప్రచారం సాగుతుంది. అందుకు తగినట్లుగానే దాదా చేసే పనులు కూడా ఉన్నాయి. ఈ మధ్యే హోమ్ మంత్రి అమిత్ షాతో కలిసి డిన్నర్ లో పాల్గొన్నారు దాదా. అప్పటినుండి ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇంటివంటి సమయంలో దాదా ఇలా ట్విట్ చేయడం.. బ్రేకింగ్ అయ్యింది.

దాంతో గంగూలీ బీసీసీఐ చీఫ్ గా తప్పుకొని.. బీజేపీలో చేరి తన రాజకీయ రంగప్రవేశం చేయనున్నారు అనే వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఒక్కసారిగా వైరల్ కావడంతో బీసీసీఐ సెక్రటరీ జై షా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. దాదా బీసీసీఐ నుండి బయటికి వెళ్లిపోవడం లేదు అని నేషనల్ మీడియాకు చెప్పారు. దాంతో మరి గంగూలీ ట్విట్ కు అర్ధం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి ఈ విషయం పై దాదా ఏమైనా స్పందిస్తారా.. లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ ఆర్డర్.. రావాల్సిందే..?

ఐపీఎల్ 2022 సీజన్ లో ఏ జట్టు ఎక్కువ సిక్సులు ఇచ్చిందో మీకు తెలుసా..?

Visitors Are Also Reading