Home » వ్యాపారాల్లో మార్వాడీలు స‌క్సెస్ సాధించ‌డానికి కార‌ణం ఏమిటో మీకు తెలుసా..?

వ్యాపారాల్లో మార్వాడీలు స‌క్సెస్ సాధించ‌డానికి కార‌ణం ఏమిటో మీకు తెలుసా..?

by Anji
Ad

మార్వాడీలు ఎక్కువ‌గా డ‌బ్బు సంపాదిస్తుంటారు. అస‌లు వారు డ‌బ్బు సంపాదించ‌డానికి ఎటువంటి సూత్రాలు పాటిస్తారు. వారు ఆ సూత్రాల వ‌ల్ల‌నే స‌క్సెస్ సాధిస్తారా.? లేక మ‌రేదైనా మ‌రేదైనా కార‌ణం ఉందా అనేది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


రాజ‌స్థాన్‌లో మార్వాడి అనే ప్రాంతం నుంచి వ‌ల‌స వ‌చ్చిన వారే మార్వాడీలు. ఆప్రాంతంలో నదులు, పంట‌లు పండే అవ‌కాశం లేదు. అదంతా ఎడారి ప్రాంతం కావ‌డంతో వారు ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ల‌స వెళ్తుంటారు. వారు ఎక్క‌డికి వెళ్లినా అక్క‌డ వారు చేసేది బిజినెస్‌. బిజినెస్ త‌ప్ప వారికి మ‌రొక‌టి తెలియ‌దు. మ‌న‌కు చిన్న స‌మ‌స్య వ‌స్తే మ‌నం ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తాం. కొన్ని సార్లు ప‌రిష్క‌రించం. కానీ మార్వాడీలు త‌ప్ప‌కుండా అన్ని సార్లు ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌ప్ప‌కుండా ప‌రిష్క‌రించుకుంటారు. కాబ‌ట్టి వీరికి జుగాడ్ అనే ప‌దం స‌రిపోతుంది. ముఖ్యంగా వారు చేసే బిజినెస్ ఏదైనా స‌రే వారు ల‌క్ష్యాన్ని ఎంచుకుంటారు. ఉద‌యం షాపు ఓపెన్ చేయ‌డం మొద‌లు నుంచి షాపు క్లోజ్ చేసే వ‌ర‌కు బిజినెస్ ను ఓ టార్గెట్ ఎంచుకుంటారు.

Advertisement

Advertisement

అదేవిధంగా బిజినెస్ చేసే స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ల‌తో వారు ఎంతో చ‌నువుగా ఉండడం వ‌ల్ల‌ వారి వద్ద‌కు వెళ్ల‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. వారు ప్ర‌తి శ‌నివారం డ‌బ్బుల‌ను క‌లెక్ష‌న్ చేస్తుంటారు. నైట్ 12 అయినా క‌లెక్ష‌న్ ఎంత వ‌చ్చిందో లెక్క రాసుకొని క్లోజ్ చేయ‌డం వారి అల‌వాటు. అదేవిధంగా చాలా మంది 30 సంవ‌త్స‌రాలు గ‌డిచినా పెళ్లి చేసుకోరు. కానీ మార్వాడీలు 21 సంవ‌త్స‌రాల‌కు క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటారు. వారి పిల్ల‌లు వారికి 40 సంవ‌త్స‌రాలు వ‌చ్చే లోపు వారి పెళ్లి అవుతుంది. పిల్ల‌లు చేతికి వ‌చ్చి వారు కూడా ఇలా బిజినెస్‌లో రొటేట్ చేస్తుంటారు. చిన్న ఏజ్‌లోనే పెళ్లి చేసుకోవ‌డం వారి లాభానికి ఒక కార‌ణం అని కూడా చెప్ప‌వచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా వారి సొంత గ్రామ‌మైన మార్వాడితో క‌చ్చితంగా సంబంధం ఉంటుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం అక్క‌డికి వెళ్తుంటారు. అదేవిధంగా వారి ఏరియాలో ప్ర‌తి గ్రామంలో మార్వాడీ సంఘాలుంటాయి. వారు ప్ర‌తి నెల‌కొక‌సారి కూడా స‌మావేశ‌మ‌వుతుంటారు. వారు ఒక‌రికొక‌రు హెల్ప్ చేసుకుంటుంటారు. వారి ఫ్యామిలీలో ఎవ‌రికి ప్రాబ్ల‌మ్ వ‌చ్చిన హెల్ప్ చేస్తుంటారు మిగిలిన వారు. వారి క‌మ్యూనిటీని వారు డెల‌ప్‌మెంట్ చేసుకుంటుంటారు. అమ్మ‌కం గురించి క‌చ్చితంగా మార్వాడీస్ చూసి నేర్చుకోవాలి. వారు ఎక్కువ‌గా డీల‌ర్స్‌, డిస్ట్రిబ్యూష‌న్స్ చేస్తుంటారు. పెళ్లి, ఫుడ్ స్టైల్ కానీ చాలా బాగుంటుంది. డొనేష‌న్ చేయ‌డంలో కూడా ముందుంటారు. కౌంట‌ర్‌లో ఎప్పుడు ఎవ‌రో ఒక‌రూ కూర్చొని ఉంటారు. ఇలా ఉండ‌డం వ‌ల్ల వారి గిరికి దెబ్బ ప‌డ‌కుండా ఉంటుంది.

Also Read : 

ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గమనించారా…జక్కన్న ఈ సీన్ ను అక్కడ నుండి దింపేసాడా..

F3 ఫస్ట్ డే కలెక్షన్స్.. రచ్చ మామూలుగా లేదుగా..?

Visitors Are Also Reading