Home » ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గమనించారా…జక్కన్న ఈ సీన్ ను అక్కడ నుండి దింపేసాడా..!

ఆర్ఆర్ఆర్ లో ఈ సీన్ గమనించారా…జక్కన్న ఈ సీన్ ను అక్కడ నుండి దింపేసాడా..!

by AJAY
Published: Last Updated on
Ad

ప్రస్తుతం దేశం లోనే టాప్ ప్లేస్ లో ఉన్న దర్శకుడు రాజమౌళి. ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఫ్లాపులు ఎరుగని దర్శకుడుగా రాజమౌళి రికార్డు సృష్టించారు రాజమౌళితో సినిమా అంటే నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ దానికి డబుల్ లాభాలు వస్తాయని నిర్మాతలు కూడా ఎక్కడా వెనక్కి తగ్గరు. మగధీర సినిమాకి ముందు రాజమౌళి కి కేవలం తెలుగులోనే క్రేజ్ ఉండేది.

Advertisement

 

కానీ ఈ సినిమా తర్వాత రాజమౌళి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి అనేది దేశంలోనే ఒక బ్రాండ్ గా మారిపోయింది. జక్కన్న సినిమా అంటే తెలుగు లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలో కలెక్షన్ల వర్షం కురవడం మొదలైంది. బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Advertisement

ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేసిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమాను ఓటిటిలో కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు ఈ సినిమాను థియేటర్లలో ప్రతి ఒక్కరూ చూశారు. ఇక ఓటీటీలో మరోసారి చూడగా సినిమాలోని కొన్ని మిస్టేక్స్ మరియు కాఫీ సీన్లను పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు.

Also Read: త‌న పేరునే సీనియ‌ర్ ఎన్టీఆర్ మ‌న‌వ‌డికి ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా…?

ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫైట్ ను బాహుబలి తో పోలుస్తూ కొన్ని మీ వైరల్ అవుతున్నాయి. బాహుబలి సినిమాలో బాహుబలి గాల్లోకి ఎగురుతాడు.. అతడి చుట్టూ నీళ్లు కనిపిస్తాయి. ఇక భల్లాల దేవుడు గాయాలతో కింద పడిపోతాడు. అచ్చం ఇలాంటి సీనే ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా కనిపించింది. ఎన్టీఆర్ నీళ్ల పైప్ లు పట్టుకుని గాల్లోకి లేస్తాడు. అదే సమయంలో రామ్ చరణ్ గాయాలతో కింద పడిపోయి అతడిని చూస్తుంటాడు. ఈ సీన్ ను బాహుబలి నుండి దింపేసారని నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి.

Also read : అల్లు అర్జున్ దెబ్బ‌కు తుఫాన్ లో కొట్టుకుపోయిన మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు ఏవో తెలుసా..!

Visitors Are Also Reading