Home » F3 ఫస్ట్ డే కలెక్షన్స్.. రచ్చ మామూలుగా లేదుగా..?

F3 ఫస్ట్ డే కలెక్షన్స్.. రచ్చ మామూలుగా లేదుగా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో తాజాగా థియేటర్లలోకి వచ్చిన చిత్రం F3.. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని చెప్పవచ్చు.. సినిమా మొదటి రోజే ఎక్స్లెంట్ ఓపెనింగ్స్ తో ముందుకు పోతోంది. ఈ విధంగా జోరు చూపిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈవినింగ్ మరియు నైట్ షోలలో తగ్గేదిలే అంటోంది. టికెట్స్ కూడా యమ జోరుగా అమ్ముడు పోతున్నాయి. దీంతో మూవీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు పైగా షేర్ అందుకోవడం తప్పనిసరి అని చెప్పాలి.

ఇక ఆఫ్లైన్ టికెట్ విషయానికి వస్తే చాలా చోట్ల సూపర్ సాలిడ్ ఉండడంతో ఈ లెక్క 11 కోట్ల రేంజ్ కు వెళ్లే అవకాశం కనబడుతోంది. అలాగే దీనికి మించి పోయేటువంటి అవుటు రైట్ చాన్స్ కూడా ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు మూవీ 13.5 కోట్ల నుంచి 14 కోట్ల దాకా కలెక్షన్స్ అందుకునే అవకాశం కూడా ఉంది. మొత్తానికి మొదటి రోజు కలెక్షన్స్ ఇటు వెంకటేష్ కెరియర్ లో కానీ, అటు వరుణ్ తేజ్ కెరియర్ లో కానీ బెస్ట్ అనిపించే అవకాశం ఉంది.

Advertisement

Advertisement

ఈ విధంగా మూవీ ఫుల్ కామెడీ, ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు పోతోంది. ఇప్పటికే దర్శకుడు చెప్పినట్టు సినిమా చాలా హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు కుటుంబంతో కలిసి చూసి నవ్వుకుంటారని, మూవీని తప్పనిసరిగా చూడాల్సిందే అని వారన్నారు. ఏది ఏమైనా ఫస్ట్ రోజు కలెక్షన్స్ తో మంచి టాక్ తెచ్చుకున్న f3 మూవీ ముందు ముందు ఏ విధంగా దూసుకుపోతుంది ఎలాంటి రికార్డులు కొడుతుందో చూడాలి.

also read;

ఎన్టీఆర్ పుట్టిన రోజునే విడుద‌లైన సినిమాలు ఎన్నంటే.??

శని జయంతి రోజున ఏ రాశివారు ఏవేవి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే ?

 

Visitors Are Also Reading