Home » సింహా,లెజెండ్, అఖండ సినిమాలు 175రోజులు ఆడిన థియేట‌ర్ల లిస్ట్ ఇదే..!

సింహా,లెజెండ్, అఖండ సినిమాలు 175రోజులు ఆడిన థియేట‌ర్ల లిస్ట్ ఇదే..!

by AJAY
Ad

న‌ట సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు సెప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ రామారావు త‌ర‌వాత ఆయ‌న న‌ట‌వార‌స‌త్వాన్ని బాల‌య్య కొన‌సాగిస్తూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడి అనిపించుకుంటున్నారు. బాల‌య్య త‌న తండ్రి ఎన్టీరామారావు వ‌ద్ద‌నే న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్చుకున్నారు. కెరీర్ లో బాల‌య్య ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాలు చేశారు. ఇక బాల‌య్య కెరీర్ లో వ‌రుస ఫ్లాప్ లు ప‌డుతున్న స‌మ‌యంలో సింహా సినిమాతో మ‌ళ్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నారు. ఈ సినిమా ఊర‌మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి మంచి విజ‌యం సాధించింది.

Advertisement

ఈ సినిమాతోనే బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్ లో మొద‌టి హిట్ పడింది. ఈ సినిమాలో బాల‌య్య డైలాగులు మ‌రియు ఫైట్ ల‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో బోయ‌పాటి బాల‌య్య‌తో మ‌రో సినిమా చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నారు. ఫ్యాన్స్ కోరిన‌ట్టుగానే బాల‌య్య బోయపాటి కాంబినేష‌న్ మ‌రోసారి సెట్ అయ్యింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో లెజెండ్ సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో బాల‌య్య‌ను స్టైలిష్ గా చూపించాడు బోయ‌పాటి.

Advertisement

ఇక ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు విల‌నిజం బాల‌య్య హీరోయిజం వేరే రేంజ్ లో ఉంటాయి. సింహం పులి ఢీ మ‌ధ్య ఫైట్ జ‌రిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డంతో ఫ్యాన్స్ వీరిద్ద‌రి కాంబోలో హ్య‌ట్రిక్ ప‌డాలని కోరుకున్నారు. ఇక ఫ్యాన్స్ అనుకున్న‌ట్టుగానే బాల‌య్య కోసం బోయ‌పాటి డ‌బుల్ యాక్షన్ క‌థ‌ను రెడీ చేశాడు. అదే అఖండ సినిమా….ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఇక ఈ మూడు సినిమాలు కొన్ని థియేట‌ర్ ల‌లో ఏకంగా 175రోజులు ఆడాయి ఆ థియేట‌ర్ లు ఏవో ఇప్పుడు చూద్దాం….సింహా సినిమా జ‌మ్మ‌ల‌మ‌డుగులోని అలంకార్ థియేట‌ర్, అదోనిలోని ప్ర‌భాక‌ర్ థియేట‌ర్, గోపాల‌ప‌ట్నంలోని మౌర్య డీల‌క్స్ థియేట‌ర్ ల‌లో 175 రోజులు ఆడింది. బాల‌య్య లెజెండ్ సినిమా ఎమ్మిగ‌నూర్ లోని మిని శివ థియేట‌ర్, ప్రొద్దుటూర్ లోని అర‌వేటి, అర్చ‌న థియేట‌ర్ లో 175 రోజులు ఆడింది. అదే విధంగా బాల‌య్య అఖండ సినిమా చిల‌క‌లూరుపేట్ లోని రామ‌కృష్ణ థియేట‌ర్ లో175 రోజులు ఆడింది.

ALSO READ:

అల్లు అర్జున్ దెబ్బ‌కు తుఫాన్ లో కొట్టుకుపోయిన మ‌హేశ్ బాబు, ప్ర‌భాస్ సినిమాలు ఏవో తెలుసా..!

Visitors Are Also Reading