అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “f3”.. ఈ మూవీ ‘f2’ కు సీక్వెల్ గా రాబోతోంది. ఇందులో వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించారు మూవీ మేకర్స్. ఈ సందర్భంగా పలువురు ప్రముఖ నటులు ఈ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. దీనికి సుమా ప్రధానంగా యాంకరింగ్ తో అదరగొట్టేసింది అని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ స్టేజి పైకి వచ్చినప్పుడు సుమ తనదైన శైలి మాటలతో రాజేంద్ర ప్రసాద్ ను ఆట పట్టిస్తుంది. దీంతో ఆయన కూడా సుమతో కాసేపు కామెడీ చేస్తారు. ఈ తరుణంలోనే సుమా మాట్లాడుతుండగానే రాజేంద్ర ప్రసాద్ “నన్ను నువ్వు ఇరిటేట్ చేస్తున్నవ్ అన్న ఫీలింగ్ తో” ఆయన స్పీచ్ మొదలుపెడతారు. దీంతో సుమా అక్కడి నుంచి పక్కకు వెళుతుంది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో రామానాయుడు తర్వాత దిల్ రాజు గారిని నేను మూవీ మొగల్ గా పిలుస్తాను అని అన్నారు.
Advertisement
Advertisement
మనిషి జీవితంలో నవ్వు అనేది ఎంత అవసరమో తప్పకుండా చెప్పే సినిమా “f3 “అని అన్నారు. గత 45 సంవత్సరాలుగా నేను నమ్మింది కామెడీనే అని ఈ మూవీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని తెలిపారు. హ్యాట్సాఫ్ టూ డైరెక్టర్ అనిల్ రావిపూడి అని అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నాను.. ఈ మూవీ హిట్ కాకపోతే ఇకపై నేను మీ ముందు నిలబడనని సంచలన కామెంట్స్ చేశారు. మీరు ఈ సినిమా చూస్తే ఎంతో నవ్వుతారు. అది మన ఇమ్యూనిటీని పెంచి మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు.
also read;
బాలకృష్ణ కూతురుగా నటించనున్న ఆ యంగ్ హీరోయిన్..!
భయమేస్తుంది నాన్న నేను బతుకలేను.. వెలుగులోకి విస్మయ ఆడియో క్లిప్..!