విశ్వనటుడు కమల్ హాసన్ మాజీ భార్య, హీరోయిన్ శృతిహాసన్ తల్లి సారికహాసన్ గురించి కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సారికహాసన్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని దాంతో స్టేజ్ షోలలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. రోజుకు రెండు మూడు వేల కోసం స్టేజి షోలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మాటలను సారికహాసన్ స్వయంగా ఓ ఇంటర్య్వూలో చెప్పిందని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోవార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
అయితే నిజానికి సారికహాసన్ చిన్నవయసు నుండే ఆర్థికకష్టాలతో పాటూ అన్నిరకాల ఇబ్బందులను ఎదుర్కుంది. సారిక ఢిల్లీలో రాజపుత్ ల వంశంలో జన్మించింది. చిన్నవయసులో ఉండగానే సారిక తండ్రి తన తల్లికి విడాకులు ఇచ్చేశాడు. అప్పటినుండి సారికతన తల్లివద్దనే పెరిగింది. ఇక ఆ తల్లి కూడా సారికను సరిగ్గా చూసుకునేది కాదట. సారిక బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వగా ఆమె డబ్బులతో తల్లి ఐదు అపార్ట్ మెంట్ లు కొనేసిందట. కానీ సారికకు మాత్రం సరిగ్గా భోజనం కూడా పెట్టేది కాదట.
Advertisement
అంతే కాదు ఒక్కోసారి ఇంట్లోకి కూడా రానిచ్చేదికాదట. దాంతో సారికషూటింగ్ లకు వెళ్లి వచ్చి బయట కార్ లోనే పడుకునేది.ఇక కొంతకాలానికి తల్లి మరణించింది. ఆస్తులన్నీ తల్లి పేరుమీదే ఉన్నాయి. ఆ సమయంలో హీరో అమీర్ ఖాన్ కజిన్ నుజిత్ ఆమె ఆస్తులను తన పేరిట రాయించుకోవడానికి లీగల్ గా సాయపడ్డారు. ఇదిలా ఉండగా సారిక జీవితంలో మంచి రోజులు వచ్చాయి. అప్పటి స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ తో సారిక ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. సారిక కపిల్ కోసం చంఢీగడ్ వెళ్లేది. ఆ తరవాత సారికకు గుండె పేలిపోయే వార్త తెలిసింది. కపిల్ దేవ్ అప్పటికే రోమి అనే ప్రేయసి ఉందని వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసింది.
దాంతో అతడికి పూర్తిగా దూరమైంది. ఆ తరవాత మరోఇద్దరితో కూడా సారిక ప్రేమలో పడింది కానీ అక్కడ కూడా సారికకు చేదు అనుభవాలు తప్పలేదు. చివరికి హీరోగా రానిస్తున్న కమల్ హాసన్ తో ప్రేమలో పడింది. అప్పటికే కమల్ హాసన్ కు వివాహం కూడా అయ్యింది. కానీ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సారికతో కమల్ సహజీవనం చేశాడు. వీరి ప్రేమకు గుర్తుగా శృతిహాసన్ పుట్టింది. అనంతరం కమల్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి సారికను వివాహం చేసుకున్నారు. ఆ తరవాత అక్షరహాసన్ పుట్టింది. ఇక ఆ తరవాత మళ్లీసారికను విధి వెక్కిరించడంతో కమల్ హాసన్ తోనూ విడాకులు తీసుకుంది. జీవితంలో ఎన్నో కష్టాలను చూసిన సారిక తన జీవితాన్ని ఎక్కడ ప్రారంభించిందో మళ్లీ అక్కడకే చేరుకోవడం బాధాకరం.
ALSO READ :
ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీమాసేన్ గుర్తుందా..?…ఇప్పుడెలా ఉంది ఏం చేస్తుందంటే..!
ఒకప్పటి డ్రీమ్ బాయ్ అరవింద్ స్వామి భార్య ఎవరో తెలుసా…ఒక్క నెలలో ఎన్నికోట్లు సంపాదిస్తుందంటే..!