రీమాసేన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ జోడీగా నటించిన రీమాసేన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రీమాసేన్ తన పదిహేనవయేటనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో బెంగాలీ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరవాత 2000 సంవత్సరంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఉదయ్ కిరణ్ హీరోగా పరిచయం అయిన చిత్రం సినిమా ద్వారానే రీమా సేన్ కూడా టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా మంచివిజయం సాధించడంతో ఇద్దరికీ గుర్తింపు వచ్చింది. ఆ తరవాత మనసంతా నువ్వే సినిమాలో కూడా ఉదయ్ కిరణ్ కు జోడీగా రీమాసేన్ నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఆమెను ఉదయ్ కిరణ్ హీరోయిన్ అని పిలిచేవారు. ఆ తరవాత శింబు హీరోగా నటించిన వల్లభ సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి అందర్ని ఆశ్చర్యపర్చింది.
Advertisement
Advertisement
అంతే కాకుండా వీడే, చెలి, అదృష్టం లాంటి సినిమాలలోనూ హీరోయిన్ గా నటించింది. 2012లో ఓ బాలీవుడ్ సినిమాలో నటించిన రీమాసేన్ ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తరవాత పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో బిజీ అయిపోయింది. రీమాసేన్ కు ప్రస్తుతం తన భర్త, కుమారుడితో హ్యాపీగా ఉంది. కానీ అప్పటికీ ఇప్పటికీ గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.
ఇక రీమాసేన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడప్పుడూ ఫ్యామిలీ విషయాలను కూడా షేర్ చేస్తుంటారు. రీసెంట్ గా తాను గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను రీమా సేన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆమె అభిమానులు చాలా మారిపోయారు అంటూ కామెంట్లు పెడుతూ మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది..రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారు అంటూ అడుగుతున్నారు.
ALSO READ :
కళ్ళు చిదంబరం తో నటించడానికి ఒప్పుకోని శ్రీదేవి.. కారణం ఇదేనా..!!
సురేఖతో పెళ్లి వద్దని చెప్పిన చిరంజీవి తండ్రి….కానీ చివరికి ఏం జరిగిదంటే..!