తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. సినిమాలపై ఆసక్తితో చిరంజీవి మద్రాసు వెళ్లి ఎంతో కష్టపడ్డారు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలు, హీరో పక్కన సోదరుడి పాత్రలు చేశారు. ఆ తరవాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన నటన, డ్యాన్స్ తో వారెవా అనిపించాడు. వరుస హిట్లు అందుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. దర్శకనిర్మాతలు చిరంజీవి డేట్స్ దొరికితే సరిపోతుంది అనుకునే రేంజ్ కు ఎదిగాడు. ఇక హీరోగా సక్సెస్ అయిన తరవాత చిరంజీవి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
వీరిద్దరిది పెద్దలు కుదర్చిన వివాహం. అయితే చిరంజీవి సరేఖల పెళ్లి గురించి ప్రముఖ నిర్మాత దవళసత్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ హీరోగా నటించిన జాతర అనే సినిమాను దవళసత్యం నిర్మించడంతో పాటూ ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఇక ఈ చిత్రానికి అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య చిరంజీవి గురించి తన వద్ద ఆరా తీశారని దవళసత్యం తెలిపారు.
దాంతో తాను చిరంజీవి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పానని అన్నారు. ఆ తరవాత అబ్బాయిని చూడొచ్చా అంటూ అల్లు రామలింగయ్య అడిగారని దాంతో ఆయన పెళ్లి గురించి మాట్లాడుతున్నట్టు తనకు అర్థం అయ్యిందని చెప్పారు. దాంతో చిరంజీవి చాలా మంచోడు అని ఎప్పటికైనా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతాడని చెప్పినట్టు తెలిపారు. అయితే చిరంజీవి తండ్రికి మాత్రం సురేఖతో వివాహం జరిపించడం మొదట ఇష్టం లేదట.
అల్లు రామలిగయ్యది సినీనేపథ్యం ఉన్న కుటుంబం అని అలాంటి కుటుంబం నుండి వచ్చి తమ కుటుంబంలో ఉండగలదా అని మెగాస్టార్ తండ్రి వద్దన్నారని చెప్పారు. దాంతో తాను అల్లు రామలింగయ్య కుటుంబం గురించి చిరు తండ్రికి చెప్పానని ఆ తరవాత ఆయన ఒప్పుకున్నారని వెల్లడించారు.
ALSO READ :
సౌత్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్య పోవాల్సిందే..?