చాణక్యుడు గొప్ప రాజనీతి శాస్త్రజ్ఞుడు అని చెప్పవచ్చు. ఆయన మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశారు. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రంలో ఆయన రాసిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. చాణక్యుడు అనుభవపూర్వకంగా చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా పిల్లలను ఎలా పెంచాలి.. ఎవరితో స్నేహపూర్వకంగా మెదలాలి.. ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలి. విజయం సాధించాలంటే ఏం చేయాలి..
ఆర్థికంగా బలపడాలంటే ఎలా ఉండాలి.. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎలా మెదలాలి. ఇలా చాలా అంశాలను ఆయన నీతీ ద్వారా వివరించారు.భార్యాభర్తలు అనేవారు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎంతో బాధ్యత కలిగి నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో కూడా అబద్ధాలు అనేవి చెప్పుకోకూడదు. ఇలా చేయడం వల్ల వారి మధ్య గౌరవం ప్రేమ పెరుగుతాయి. అలాగే ఇద్దరు కలిసి ఉండాలి. మనస్పర్ధలు తెచ్చుకొని ఇద్దరి మధ్యలో మరొక వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదు. అప్పుడే ఆనందంగా ఉంటారు. అలాగే కోపం బంధాల మధ్య చిచ్చు పెడుతుంది. అందుకే మితిమీరిన కోపాన్ని తగ్గించుకోవాలి.
Advertisement
Advertisement
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇద్దరు కలిపి మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు చెప్పుకోకూడదు. కొన్ని అంశాలను రహస్యంగానే ఉంచుకోవాలి. ఇలా చేయడం ఇద్దరికీ మంచిదే. ఈ విషయాలు ఇతరులకు చెప్పినట్లయితే ఒకానొక టైంలో మీ పైనే వారు ప్రయోగిస్తారు. వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకొని బాధపడితే మన పరిస్థితి బాగా లేనప్పుడు వారు ఎగతాళి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే భార్య భర్తలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసి జీవించాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు.
also read;
ఆషాఢమాసం లో భార్య భర్తలు ఎందుకు కలుసుకోవద్దు..? కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా…!
చిత్ర పరిశ్రమలో మరొక విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి..!