Home » కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!

కేన్ విలియమ్సన్ పై లారా అసహనం…!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 ను వరుస పరాజయాలతో ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత వరుసగా 5 మ్యాచ్ లలో విజయం సాధించింది. దాంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం ఖాయం అనుకున్నారు అంతా..! ఎందుకంటే మొదటి 7 మ్యాచ్ లలో 5 విజయాలు అందుకున్న సన్ రైజర్స్ మిగిలిన 7 మ్యాచ్ లలో మూడు గెలిస్తే చాలు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. సెకండ్ ఆఫ్ లో ఆడిన 5 మ్యాచ్ లలో 5 ఓడిపోయింది హైదరాబాద్. దాంతో ఇప్పుడు ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోయాయి.

Advertisement

అయితే ఆ జట్టు కూటములకు ప్రధాన కారణం.. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. జట్టు ఓపెనర్ గ ఆవస్తున కేన్ మామ… పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లోను విఫలమవుతూనే ఉన్నాడు. నిన్న కేకేఆర్ తో జరిగిన ఎంతో కీలకమైన మ్యాచ్ లో కూడా విలియమ్సన్ నిరాశపరిచాడు. 17 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేసుకున్నాడు. అయితే కేన్ ఔట్ అయిన తర్వాత.. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది.

Advertisement

విలియమ్సన్ ఔట్ అవ్వడంతోనే డగ్ ఔట్ లో కూర్చునా లారా.. తల పట్టుకున్నాడు. ఇక దీనికి మన ఫ్యాన్స్ రకరకాల మిమ్స్ తో ఆడుకుంటున్నారు. ఇక వీడిని ఎలా మార్చాలి అని లారా అనుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న నమ్ముకొని గత కెప్టెన్ వార్నర్ ను వదులుకున్న సన్ రైజర్స్ యాజమాన్యం ఇప్పుడు ఏడుస్తుంది అని ఇంకొందరు అంటున్నారు. ఎందుకంటే వార్నర్ ఇప్పుడు ఢిల్లీ తరపున ఆడుతూ ఆదరగొడుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

చెన్నై గుజరాత్ విజయం.. క్వాలిఫైర్ 1 బెర్త్ ఖాయం..!

Visitors Are Also Reading