Home » ధోనిని విషయంలో అన్ని జట్లకు అక్తర్ వార్నింగ్..!

ధోనిని విషయంలో అన్ని జట్లకు అక్తర్ వార్నింగ్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా తప్పుకొని ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. కానీ జడేజా అందులో విఫలం కావడంతో మళ్ళీ ధోనినే కెప్టెన్ గా బాధ్యతలను స్వీకరించాడు. అయితే ఐపీఎల్ 2022 మొదటి భాగంలో విఫలం అయిన చెన్నై ధోని కెప్టెన్సీలో ఆడిన మూడు మ్యాచ్ లలో రెండు విజయాలు నమోదు చేసింది. అలాగే నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ధోనికూడా తన బ్యాట్ ను ఝుళిపించాడు.

Advertisement

ఈ క్రమంలో ధోని విషయంలో అన్ని జట్లకు పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు. అక్తర్ మాట్లాడుతూ.. అతని పేరు ధోని. అతని ఆలోచనలు ఎవరికీ అంతు పట్టవు. అతడిని ఎవరు తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే.. ధోనికి సవాళ్లు అంటే ఇష్టం. వాటిని ఓడించడం ఇష్టం. కాబట్టి ధోని ఎలాంటి వ్యూహాలు రచిస్తాడో ఎవరికీ తెలియదు.

Advertisement

ధోని మాకు అందరికి చాలా గౌరవం ఉంది. తాను ఏం చేస్తున్నాను అనేది ధోనికి చాలా క్లియర్ గా ఉంటుంది. అతను తొందరపాటులో ఏం నిర్ణయాలు తీసుకోడు. పరిస్థితిని బాగా అంచనా వేయడంలో ధోని దిట్ట. అతను ఐపీఎల్ 2023 లో కూడా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడు. అలాగే బ్యాటింగ్ కూడా బాగానే చేస్తున్నాడు. ఒకవేళ అతను ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన చెన్నై జట్టును మాత్రం వదలడు అని అక్తర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఆ విషయంలో అశ్విన్ ను అనుసరించాలనుకున్న డుప్లెసిస్.. కానీ..?

వరుస గెలుపులతో ఉన్న ముంబై షాక్.. ఆటగాడికి మళ్ళీ గాయం..!

Visitors Are Also Reading