Home » వైరల్ అవుతున్న రామ్ చరణ్ హీరోయిన్ వర్కౌట్ వీడియో..!

వైరల్ అవుతున్న రామ్ చరణ్ హీరోయిన్ వర్కౌట్ వీడియో..!

by Anji
Ad

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల దాదాపుగా అందరికీ తెలిసిపోతుంది. ఇదివరకు ఎక్కువగా సెలబ్రిటీలు సోషల్ మీడియాను వినియోగించేవారు. ప్రస్తుతం అందరూ వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని షేర్ చేస్తుండడంతో ఎక్కువగా ఫోటోలు, వీడియోలు పంచుకొని ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నారు. సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో ఎక్కువగా ఏలడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

Advertisement

ఒక‌ప్పుడు సాధార‌ణంగా ఉన్న హీరోయిన్లు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో సినీ అవకాశాలు ఎక్కువగా పొందడానికి తమ అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అదేవిధంగా అవకాశాలు రావడానికి కూడా సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫిజిక్ పరంగా గ్లామర్ పరంగా బాగానే ఉన్నా కూడా అవకాశాలు అందుకోవడం లేదు కొంతమంది హీరోయిన్లు. మరికొందరు మాత్రం సెకండ్ ఆప్షన్ తో రీ ఎంట్రీ ఇచ్చి బాగా సెటిల్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగా.. హీరోయిన్ కూడా మంచి ఫామ్ లోకి రావడానికి సోషల్ మీడియాను వాడుకుంటుంది.

ఇంతకు ఆ హీరోయిన్ మరెవరో కాదు నేహా శర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నేహ శర్మ అంటే అందరికీ తెలుసే.. తన అందంతో మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంది. గ్లామర్ బ్యూటీ తొలిసారి రామ్ చరణ్ నటించిన చిత్రం చిరుత‌తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ లోకి అడుగు పెట్టి అక్కడే సెటిల్ అయింది. అక్కడ వర్షం ప్రాజెక్టులతో అవకాశాలను దక్కించుకుంది. అక్కడ కూడా తనకంటూ ఓ ఫాలోయింగ్ సొంతం
చేసుకుంది.


నేహ శర్మ ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం ర‌క‌ర‌కాల‌ ఫోటోలతో రచ్చ చేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో తాను వర్కౌట్ చేస్తున్నట్టు కనిపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నేహ శర్మ మళ్లీ మంచి ఫామ్ లోకి రావడానికి వర్కౌట్ లతో బాగా కష్టపడుతుంది అని పేర్కొంటున్నారు. మరికొందరు తాను చేసిన వర్కౌట్స్ కి తెగ లైకులు కొడుతున్నారు. ఈ అమ్మడు పూర్తిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఏలుతుందని తెలుస్తోంది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుందో లేక బాలీవుడ్ లోనే కొనసాగుతుందో వేచి చూడాలి.

Also Read : 

బ్యాగ్రౌండ్ లేకుండా వ‌చ్చి ఇండ‌స్ట్రీని ఏలుతున్న 6గురు స్టార్ హీరోలు వీరే..!

ఈ స్టార్ హీరోలు,హీరోయిన్లు పెళ్లి ఎందుకు చేసుకోవడంలేదో నిజాలు బయట పెట్టిన వేణు స్వామి..!!

 

Visitors Are Also Reading