తల్లి కావటం లేదా తండ్రి కావటం అన్నది జీవితంలో ఒక గొప్ప అనుభూతి, ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేము. అయితే తమకు పుట్టబోయేది అబ్బాయో, అమ్మాయో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడానికి అందరికీ ఉన్న ఒకే ఒక ఆప్షన్ స్కానింగ్. కానీ ఒకప్పుడు ఈ స్కానింగ్ ద్వారా ముందస్తుగా పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ ఆ తరువాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల ముందస్తుగా చెప్పవద్దని స్కానింగ్ సెంటర్ లకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటి నుండి స్కానింగ్ ద్వారా తెలుసుకునే అవకాశం పోయింది. దీంతో డెలివరీ అయిన తరువాత మాత్రమే ఇప్పుడు దంపతులు అబ్బాయా, అమ్మాయా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు.
Advertisement
Advertisement
అయితే స్కానింగ్ ద్వారా కాక ఇంకో పద్దతి ద్వారా పుట్టబోయేది అబ్బాయా, అమ్మాయా అని తెలుసుకోవచ్చట. చైనా దేశంలోని ఓ రాజ సమాధిలో 700 సంవత్సరాల క్రితం ఓ చార్ట్ దొరికిందట. ఈ చార్ట్ లో ఉన్నట్లు వందకు తొంభై శాతం జరుగుతుందట. అయితే ప్రస్తుతం ఈ చార్ట్ ను చైనాలోని ఓ మ్యూజియంలో భద్రపరిచినట్లు తెలుస్తోంది. ఈ చార్ట్ ద్వారా మనకు ఎలా తెలుస్తుందనే విషయాన్ని ఒకసారి మనం విశ్లేషిస్తే ఈ చార్ట్ లో అడ్డంగా 18 నుండి 45 వరకు అంకెలు ఉంటాయి. ఈ అంకెలకు అర్ధం ఏంటంటే ఈ అంకెలు అమ్మాయిల వయసును సూచిస్తాయి.
ఇక నిలువుగా జనవరి నుండి డిసెంబర్ వరకు నెలలు పొందుపరచబడ్డాయి. అయితే ఈ చార్ట్ లో F, M అనే అక్షరాలు ఉంటాయి. F అంటే అమ్మాయి అని M అంటే అబ్బాయి అని అర్థం. ఉదాహరణకు 23 సంవత్సరాలు గల అమ్మాయి సెప్టెంబర్ లో నెల తప్పితే ఈ చార్ట్ ప్రకారం ఆమెకు పుట్టబోయేది అబ్బాయి అని అర్థం. ఏది ఏమైనా ఈ చార్ట్ కాస్త ఆసక్తికరంగా ఉంది కదా. మీ ఇంట్లో కూడా ఎవరైనా అబ్బాయి లేదా అమ్మాయి జన్మించడానికి సిద్దంగా ఉంటే ఈ చార్ట్ తో ఒకసారి ట్రై చేయండి.
Also Read: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…పుష్ప ట్రైలర్ డేట్ ఫిక్స్..!