Ad
ఐపీఎల్ 2022 లో తమ జట్టుకు ఎంతో ఉపయోగపడుతాడు అని 8.5 కోట్లు పెట్టి వాషింగ్టన్ సుందర్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. అందుకు తగ్గట్లుగానే మొదటి రెండు మ్యాచ్ లలో బాగా రాణించిన సుందర్.. తర్వాత గాయపడ్డాడు. బౌలింగ్ చేసే చేతికి గాయం కావడంతో.. దాదాపు అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడు అనుకున్నారు.
అయితే సుందర్ జట్టు నుండి వెళ్లిన తర్వాత అతని స్థానంలో వచ్చిన జగదీష్ సుచిత్ రాణించడంతో జట్టు విజయాలు సాధించింది. కానీ సుందర్ ఎవరు ఊహించని విధంగా త్వరగా కోలుకొని గుజరాత్ తో జరిగిన మ్యాచ్ తో మళ్ళీ జట్టులో చేరాడు. ఆ తర్వాత నిన్న చెన్నై తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో సుందర్ మళ్ళీ గాయపడ్డాడు. ఈ విషయాన్ని జట్టు హెడ్ కోచ్ టామ్ మూడీ తెలిపాడు.
నిన్న చెన్నై మ్యాచ్ లో సుదర్ కు మళ్ళీ బౌలింగ్ చేసే చేతికే గాయం అయ్యింది. అందుకే అతను ఆ మ్యాచ్ లో బౌలింగ్ చేయలేదు. అతను గాయంతో ఆడితే అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే సుందర్ కు విశ్రాంతినీ ఇవ్వాలి అనుకుంటున్నం. అందువల్ల ఢిల్లీతో ఈ నెల 5న జరిగే మ్యాచ్ కు అతను అందుబాటులో ఉంటాడా.. ఉండడా.. అనేది చేపలేకపోవుతున్నాను అంటూ మూడీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Advertisement