మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆచార్య సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను వీక్షించిన కొంత మంది ఆడియన్స్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండతో పోల్చుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు సినిమాల స్టోరీ ఒకటే అని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ రెండు సినిమాలు హిందూ ధర్మం, మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాలే కావడం విశేషం.
అఖండ చిత్రాన్ని మైనింగ్ మాఫియాను ఓ అఘోరా ఎదురించిన తీరును.. హిందూ ధర్మంలో ధర్మో రక్షతి రక్షితః నేపథ్యంలో తెరకెక్కించారు. అధర్మం జరిగినప్పుడు దేవుడు దానిని చక్కదిద్దడానికి దిగి వస్తాడనే కాన్సెప్ట్‌తో చిత్రీకరించారు. ఇక ఆచార్య సినిమా మైనింగ్ నేపథ్యంలోనే తెరకెక్కించారు. అఖండలో బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తే.. ఆచార్యలో చిరంజీవి కామ్రెడ్‌గా నటించారు. ధర్మాన్ని కాపాడేందుకు ఆచార్య అనే నక్సలైట్ రంగంలో దిగడం ఆచార్య కథ.
Advertisement
Advertisement
ఇక ఆచార్య, అఖండ ఈ రెండు సినిమాల మెయిన్ స్టోరీ మైనింగ్ మాఫియాతో పాటు హిందూ ధర్మానికి న్యాయం చేయడమే కాన్సెప్ట్. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కించిన అఖండ హీరో ఎలివేషన్ సీన్స్ బాగా పండాయి. కానీ కొరటాల శివ, చిరంజీవి కాంబోలో సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో షూటింగ్ ప్రారంభించారు. గత ఏడాది మే నెలలోనే విడుదల కావాల్సింది. తొలుత ఆచార్య మే 12 2021, అఖండ మే 28, 2021న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్‌తో అది కుదరలేదు.
ఆచార్య సినిమాను పలు కారణాలతో వరుసగా పోస్ట్ పోన్ చేస్తూ ఎట్టకేలకు ఏప్రిల్ 29, 2022న విడుదల చేశారు. ఇక కరోనా సెకండ్ వేవ్ తరువాత ధైర్యంగా సినిమా థియేటర్‌లలో అన్‌సీజన్‌లో డిసెంబర్ 01, 2021లో అఖండ విడుదల చేసి మంచి విజయమే సాధించారు. అఖండను ఆదర్శగా తీసుకుని మిగిలిన సినిమాలు క్యూ కట్టాయి. ఇక ఫిబ్రవరి నెల నుంచి వరుసగా పెద్ద సినిమాలు క్యూకట్టాయనే చెప్పాలి. ఆచార్య ఎన్నో వాయిదాల తరువాత విడుదలై నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇవాళ కొన్ని సినిమా థియేటర్స్ కూడా తీసేసినట్టు సమాచారం. కలెక్షన్ల పరంగా ఆచార్య సినిమాకు నష్టాలా.. లాభాలా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాలి.
Also Read :
మహేష్‌బాబుకు షాక్.. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట ట్రైలర్..!
హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!