Home » డెబ్బై ఏళ్ల వ‌య‌సులో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసిన ఎమ్మెల్యే..!

డెబ్బై ఏళ్ల వ‌య‌సులో ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష రాసిన ఎమ్మెల్యే..!

by Anji
Published: Last Updated on
Ad

చదువును ఎవ్వరైనా చదువుకోవచ్చు. ఈ వయసులో ఆ వయసులో అనే తేడా లేదు. చదువుకు వయసుతో అసలు సంబంధమే లేదని ఓ ఎమ్మెల్యే నిరూపించాడు. చిన్నప్పుడు చదువుకోవడం లో కానీ వారు పెద్దయ్యాక కూడా చదువుకుంటున్నారు. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా 70 ఏళ్ల వయసులో పదవ తరగతి పరీక్ష రాశాడు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఒడిస్సా రాష్ట్రం లో ఉన్నటువంటి కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగడ కన్హర్ ఫులభావి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు.

Advertisement

1978లోనే కన్హర్ తన చదువును మధ్యలో ఆపేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించినప్పటికీ పదవతరగతి కూడా చదవలేకపోయాను. అనే బాధ ఆయనను వెంటాడేది. ఎలాగైనా సరే తను చనిపోయే లోపు పదో తరగతి పరీక్ష పాస్ కావాలని నిశ్చయించుకున్నాడు. కర్ణం లోనే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు హై స్కూల్ వార్షిక పరీక్షలకు ఆయన హాజరయ్యారు. ఆ పరీక్ష కేంద్రం వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్ష, హాజరైన వార్తల్లో నిలిచిన ఆ ఎమ్మెల్యేను అందరూ అభినందిస్తున్నారు. ఆశయానికి ఎప్పుడూ వయసు అడ్డుకాదని సూచిస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు ఒడిస్సా రాష్ట్ర వ్యాప్తంగా 5.71 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు 9372 మంది ఓపెన్ స్కూల్, 4,443 మంది మాధ్యమ పరీక్షలు రాశారు.

Advertisement

 

ఏప్రిల్ 29న ప్రారంభమైన ఈ పరీక్షలు మే 6 వరకు జరగనున్నాయి. ఇటీవల కేరళకు చెందిన 104 ఏళ్ల వృద్ధురాలు చదువుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్కూల్ యాజమాన్యం నిర్వహించిన పరీక్షల్లో 89 మార్కులు సంపాదించి సంతోషపడింది. మార్పులను చూసి మురిసిపోతూ తనివితీరా నవ్విన నవ్వు చూసి కలెక్టర్ ఫిదా అయ్యాడు. తన మొబైల్ లో పంపి సోషల్ మీడియాలో కలెక్టర్ అప్‌లోడ్ చేశాడు. వార్త చూసిన ప్రతి ఒక్కరూ ఆ బామ్మను పొగిడారు. 100 ఏళ్లు దాటినా ఆమెకు చదువుకోవాలంటే తపన ఉన్నది. నేటి బాల్యానికి యువతకు ఆదర్శం అని కామెంట్లు చేశారు.

Also Read : 

“ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా వదులుకున్న కార్తీకదీపం నటి..!

Visitors Are Also Reading