రెండు భాగాలుగా వచ్చిన కేజీఎఫ్ అనే సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం విడుదలై అందనలకు మించి విజయం అందుకోవడంతో రెండవ భాగం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు. ఏంహుకంటే మొదటి భాగంలో చూపించిన హీరో ఎలివేషన్స్, అమ్మ సెంటిమెంట్ అలా ఉంది.
Advertisement
ఇక అభిమానుల ఆసక్తికి తెర దించుతూ.. ఈ నెల 14న విడుదలైన కేజీఎఫ్ 2 ఇంకా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కనిపించిన పాత్రలు, సన్నివేశాలు ఫ్యాన్స్ ను ఆ లోకంలోకి తీసుకెళ్తున్నాయి. అందుకే హీరో యష్ అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఏ సినిమా తెలుగులో ఇంత విజయం సాధించడానికి ఓ సీసీనియర్ నటుడు కారణం అని తెలుస్తుంది.
Advertisement
ఆయన మరెవరో కాదు.. తెలుగు లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారు. ఎందుకంటే.. ఈ సినిమాను తెలుగులో సమర్పించింది ఆయనే. అంటే ఈ సినిమాను మన తెలుగు అభిమానుల ముందుకు తెచ్చింది కైకాల గారే అని చెప్పాలి. ఆయన ధైర్యంతో కేజీఎఫ్ మొదటి పార్ట్ తెలుగులో విడుదల చేయకుంటే.. ఇప్పుడు ఈ చాఫ్టర్2 సినిమా ఇంత విజయం స్ఫహించేది కాదు. అందుకే ఈ సినిమా విజయం వెనుక కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
కోహ్లీ ప్లాప్ షో పై దాదా కీలక వ్యాఖ్యలు…!
డేవిడ్ భాయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్…!