Home » టయోటా ఇన్నోవాను సెలబ్రెటీలు ఎక్కువ ఎందుకు వాడుతారో తెలుసా..?

టయోటా ఇన్నోవాను సెలబ్రెటీలు ఎక్కువ ఎందుకు వాడుతారో తెలుసా..?

by Azhar
Ad
భారత దేశంలో చాలా రకాల కార్ల కంపెనీలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రజాధారణ పొందాయి. అంటువంటి వాటిలో ఒక్కటే టయోటా ఇన్నోవా. ఈ కారుకు దేశ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. చాలా మంచి సెలబ్రెటీలు అంటే రజినీకాంత్, అమిర్ ఖాన్ లాటి వారు కూడా ఈ కారునే ఉపయోగిస్తున్నారు. దాంతో దీనికి ఈ మధ్యలో మన ఇండియాలో డిమాండ్ తగ్గేలా కనిపించడం లేదు. అయితే ఈ టయోటా ఇన్నోవాను మన దగ్గర చాలా మంది ఉపయోగించడానికి గల కారణాలను ఇప్పుడు చూద్దాం..!
ఈకారు లోని ఇంజర్ కారణంగా ఇది ఎక్కువ ప్రజా నమ్మకంను సంపాదించుకుంది. ఎన్నో లక్షల కిలో మీటర్లు తిరిగినా… దీని ఇంజన్ ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తుంది. దీనిలోని D-4D ఇంజిన్ చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే దీని సౌకర్యవంతమైన రైడ్ కూడా ప్రజలను ఆకర్షించింది. ఇన్నోవా యొక్క సస్పెన్షన్ సెటప్‌ ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై కూడా చాలా సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది. అందుకే బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కూడా ఈ టయోటా ఇన్నోవాను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఇక ఎవరైనా బండి కొన్నేటప్పుడు దాని మెంటనెన్స్ కు అయ్యే ఖర్చు గురించి తప్పకుండ ఆలోచిస్తారు. అయితే ఈ టొయోటా ఇంజన్ మరియు దాని నిర్వహణ ఖర్చు అనేది చాలా తక్కువ. అలాగే టయోటా ఇన్నోవాలో చాలా మార్పులు జరిగి ఇన్నోవా క్రిస్టాఅనే పేరుతో కొత్త జనరేషన్ వచ్చింది. ఇందులో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, వెనుక AC, డిజిటల్ డిస్‌ప్లే, లెదర్ సీట్లు వంటి అంద్భుతమైన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఈ అధిక సౌలభ్యాలు దీని మార్కెటింగ్ ను మరింతగా పెంచేసాయి. అందుకే రజినీకాంత్ కూడా ఈ కారునే కేవగా ఉపయోగిస్తారు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading