సినిమా వాళ్ళు ప్రతిదానికి సెంటిమెంట్ చూస్తారు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి అందులో సెలెక్ట్ చేసే హీరోయిన్, డైరెక్టర్ ఇలా రక రకాల సెంటిమెంట్లు ఉంటాయి. ఇక ఆ సెంటిమెంట్లు ఫాలోచెయ్యడంలో ఒకొక్కరిదీ ఒక్కోరీతిలో ఉంటాయి. ఒక్కోక్కరు ఒక్కో స్టైల్లో ఫాలోఅవుతూ ఉంటారు. కొంత మంది దర్శకులను సెంటిమెంట్లుగా తీసుకుంటారు. మరికొందరు హీరోయిన్లను ఇంకొందరు వారు ధరించి దుస్తులను..ఇలా ఒక్కొక్కరికి ఒక్కోరకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే వారనుకున్న సెంటిమెంట్లను ఫాలోఅయితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని వారు నమ్ముతారు.
మెగా స్టార్ చిరంజీవి : తాను నటించిన సినిమా సూపర్ హిట్ కావాలి అంటే కనీసం ఒక్క పాటలో అయినా వైట్ ప్యాంటు తో కనిపిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్.
Advertisement
అల్లు అర్జున్ : తాను నటించే సినిమాలో కనీసం ఒక్క సీన్ అయినా విశాఖపట్నంలో తీస్తేగాని సక్సస్ రాదు అనే సెంటిమెంట్.
Advertisement
దర్శకుడు కె. రాఘవేంద్రరావు: తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ మొదలు కాగానే ఆ సినిమా పూర్తి అయ్యే వరకు తన గెడ్డంతో పాటు తన మీసాన్ని కూడా కనీసం ట్రిమ్ కూడా చేయడట అలా చేస్తే తన సినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్.
దర్శకుడు భారతీరాజా : తన సినిమాలలో ‘ర’ అనే మొదటి అక్షరంతో ఉండే హీరోయిన్స్ నటిస్తేనే తన సినిమాలు సూపర్ హిట్ అవుతాయన్న నమ్మకంతో రాధా, రాధిక, రేవతి లతో అనేక సినిమాలు తీసాడనే టాక్ ఉంది.
ఇలాంటి సెంటిమెంట్లనే కొనసాగిస్తూ బండ్ల గణేష్, దిల్ రాజ్, రామనాయుడు, బెల్లంకొండ సురేష్ లాంటి బడా నిర్మాతలు కూడ తమ సినిమా ఆడియో కాపీని మొట్టమొదటిగా తాము ఇష్టపడే దేవాలయాలకి వెళ్లి పూజలు చేయించిన తరువాతే సినిమా పబ్లిసిటీ మొదలు పెడతారట!
Also Check : అప్పట్లో వచ్చిన బెస్ట్ తెలుగు సీరియల్స్ ఇవే…!