Home » కెజియఫ్ 2 సక్సెస్ కి కారణం రాజమౌళి.. ఎలా అంటే..?

కెజియఫ్ 2 సక్సెస్ కి కారణం రాజమౌళి.. ఎలా అంటే..?

by Azhar
Ad

దర్శక ధీరుడు రాజమౌళి తెరక్కేకించిన ఆర్ఆర్ఆర్ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భావి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సినీ అభిమానులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న కెజియఫ్ పార్ట్ 2 కూడా విడుదలై బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ రెండు సినిమాలు సౌత్ ఇండస్ట్రీ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. బాహుబలితోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా జక్కన మారిపోగా.. కెజియఫ్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇండియా డైరెక్టర్ అయ్యాడు. కానీ ఈ కెజియఫ్ సినిమా ఇంత భారీ విజయం సాధించడం వెనక కూడా మన రాజమౌళి హస్తమే ఉందట.

Advertisement

అది ఎలా అంటే… ముందు దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజియఫ్ సినిమాను ఒక్క పార్ట్ లోనే ముగించాలి అనుకున్నాడు. కానీ ఇది పెద్ద ప్రైజెక్టు కావడంతో.. అప్పటికే బాహుబలితో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన జక్కనకు సినిమా గురించి, షూటింగ్ గురించి చెప్పాడు. అయితే కథ బాగా నచ్చడంతో జక్కన.. దీనిని రెండు భాగాలుగానే తీస్తే బాగుంటుంది. ఒక్క పార్ట్ లో అయితే కథను సరిగ్గా చెప్పలేరు అని అన్నాడట.

Advertisement

అలాగే ఎడిటింగ్ లో బాగా శ్రద్ధ తీసుకునే రాజమౌళి కెజియఫ్ సినిమా యొక్క ఎడిటింగ్ లో కూడా పాల్గొన్నాడట. జక్కన చెప్పడంతో సినిమాలో కొన్ని సన్నివేశాలను కలిపి.. మరికొన్ని సన్నివేశాలను తీసేసినట్లు సమాచారం. ఈ విధంగా జక్కన కెజియఫ్ సినిమా విజయంలో పాలుపంచుకున్నాడు. కానీ ఇందులోని డైలాగులు, టేకింగ్ క్రెడిట్ మొత్తం ప్రశాంత్ నీల్ దే.

ఇవి కూడా చదవండి : ఆర్సీబీ టైటిల్ గెలిచే వరకు పెళ్లి చేసుకోను.. అయితే అంతే సంగతి..!

ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

 

Visitors Are Also Reading