Home » ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

ధోని ముందే హెలికాప్టర్ షాట్ ఆడిన సిరాజ్..!

by Azhar
Ad

ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు ఏవి అంటే.. అందరూ చెప్పే పేరు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. కానీ ఈ ఏడాది ఐపీఎల్ 2022 లో మాత్రం ఈ రెండు జట్లు దారుణంగా విఫలమవుతున్నాయి. ముంబై జట్టు ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్ లలో ఓడిపోగా… చెన్నై కూడా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడి..చివరిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో ఆడిన మ్యాచ్ లో విజయం సాధించింది.

Advertisement

Advertisement

అయితే ఈ మ్యాచ్ లోనే ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. బెంగళూర్ బ్యాటింగ్ లో చివరి ఓవర్ లోని.. ఆఖరి బంతిని ఎదుర్కున్న పేసర్ మొహ్మద్ సిరాజ్ అద్భుతమైన హెలికాప్టర్ షాట్ ఆడాడు. ఆ షాట్ వేరే టీం పైన కొడితే ఇంతలా చర్చ జరగకపోవచ్చు.. కానీ ఆ షాట్ ప్రపంచానికి పరిచయం చేసిన ధోని వికెట్ల వెనుక కీపింగ్ చేస్తుండగా.. సిరాజ్ హెలికాప్టర్ షాట్ ఆడాడు.

ధోని హెలికాప్టర్ షాట్ లా అది సిక్స్ కు అయితే పోలేదు.. కానీ బౌండరీ రోప్ ను మాత్ర, దాటింది. ప్రస్తుతం సిరాజ్ కొట్టిన ఈ షాట్ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 216 పరుగులు చేయగా.. ఆర్సీబీ 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 23 పరుగులతో చెన్నై ఐపీఎల్ 2022 లో మొదటి విక్టరీ సాధించింది.

Visitors Are Also Reading