Home » లంక నుంచి ఆసియా కప్ ఔట్..?

లంక నుంచి ఆసియా కప్ ఔట్..?

by Azhar
Ad

2020 లో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ ఇప్పటివరకు జరగలేదు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేతిలో ఉన్నాయి. అయితే మొదట ఈ టోర్నీని తమ దేశంలోనే నిర్వహిస్తామని పాకిస్థాన్ బోర్డు చెప్పింది. అలా అయితే ఈ టోర్నీలో భారత జట్టు పాల్గొనదని… పాకిస్థాన్ కు జట్టును పంపడం మాకు ఇష్టం లేదు అని బీసీసీఐ ప్రకటించింది. మొదట్లో అందుకు ఒప్పుకొని పాకిస్థాన్ బోర్డు ఆ తర్వాత దిగి వచ్చింది. ఈ టోర్నీని వేరే దేశంలో నిర్వహిస్తామని చెప్పి.. నాలుగు ఐదు దేశాలను అనుకోని ఆఖరికి శ్రీలంకలో నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది.

Advertisement

Advertisement

అయితే ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభం కావాల్సిన ఆసియా కప్ కు కొత్త కష్టం వచ్చింది. ఈ టోర్నీని నిర్వహించాలి అనుకుంటున్న శ్రీలంకలో పరిస్థితి ఎలా ఉంది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం లంక ఆరుదిక సంక్షోభంలో మునిగిపోయింది. అక్కడి ప్రజలు తిండి లేక అలాడిపోతున్నారు. ఈ సంక్షోభం రోజు రోజుకు పెరుగుతుంది తప్ప.. తగ్గడం లేదు.

దాంతో ఇటివంటి పరిస్థితుల్లో లంకలో ఆసియా కప్ నిర్వహించడం చాలా కష్టం అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అభిప్రాయపడుతోంది. అందుకే ఈ టోర్నీ నిర్వహించడానికి మరో వేధియాను చుకోవాలని పాకిస్థాన్ కు సీజెప్పినట్లు తెలుస్తుంది. ఇదే విషయంలో మరో వారం రోజులో ఓ మీటింగ్ ను ఏర్పాటు చేసి ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Visitors Are Also Reading