పరుచూరి బ్రదర్స్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వీరు దగ్గరయ్యారు. అయితే పరుచూరి బ్రదర్స్ అంటే ఇద్దరు వ్యక్తులు కానీ వీరిద్దరినీ వేరు చేసి ఎప్పుడూ చూడలేం. సొంత అన్నా దమ్ములు అయిన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి బ్రదర్స్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాలకు పనిచేశారు.
Advertisement
ఎన్నో సినిమాలకు కథను అందించడంతో పాటూ డైలాగులు కూడా రాశారు. ముఖ్యంగా డైలాగులతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకూ హీరోలతో పనిచేశారు. అంటే దాదాపు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేశారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నం 150 సినిమాకు కూడా మాటలు అందించారు.
Advertisement
ఇదిలా ఉంటే పరుచూరి బ్రదర్స్ కు ఆ పేరు ఎలా వచ్చింది. మొదటగా ఎవరు ఆ పేరును పెట్టారు అన్నది మాత్రం చాలా మందికి తెలియని ప్రశ్న…నిజానికి ఇద్దరూ అన్నదమ్ములు..బ్రదర్స్ కాబట్టి వాళ్లే పెట్టుకున్నారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఈ పేరు వెనక ఉన్న అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హలో బ్రదర్….అనే మాట వినిపించిందంటే ప్రతిఒక్కరి మెదడులో తట్టేది అన్నగారు ఎన్టీరామారావు పేరే.
ప్రస్తుతం ప్రభాస్ కు డార్లింగ్ అని పిలవడం ఎలా అలవాటో అదే విధంగా అప్పుడు ఎన్టీఆర్ కూడా తనకు కలిసిన వారితో బ్రదర్ అంటూ మాట్లాడేవారు. అంతే కాకుండా ఎన్టీఆర్ సినిమాలలో కూడా చెప్పండి బ్రదర్…ఏంటి బ్రదర్ లాంటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. కాగా పరుచూరి బ్రదర్స్ కు కూడా మొదట అలా పిలిచింది ఎన్టీఆరే అట. ఎన్టీఆర్ అలా పిలవడం వల్ల కొంత కాలానికి ఇద్దరి పేరు కలిపి పరుచూరి బ్రదర్స్ అని ఫేమస్ అయ్యిందట. ఈ విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా వెల్లడించారు.