కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. స్కూళ్లు, కళాశాలలు, ఉపాధి రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. జనజీవనం సాధారణంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో రద్దీ పెరిగింది. ఇప్పటికే సిటీ బస్ సర్వీసులను అందుబాటులో ఉంచిన ఆర్టీసీ, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారు జామున 4 గంటల నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటుగా, ఎంజీబీఎస్, జేబీఎస్ లలో కూడా తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ బస్సులను అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నది.
Advertisement
Advertisement
ఈ ప్రాంతాల నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు ఉదయం 4 గంటల నుంచి బస్సులు బయలుదేరనున్నాయి. కరోనాకు ముందు ఉన్నట్టుగానే ఉదయం 4 గంటల నుండే అన్ని బస్సులు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇక విద్యావ్యవస్థలు పూర్తిస్థాయిలో తెరుచుకోవడంతో విద్యార్థులకు కోసం కోఠీ- హయత్‌నగర్ మధ్య అదనంగా మరో 12 సర్వీసులను నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవాళ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.