Home » కే.ఎల్‌. రాహుల్‌కు గంభీర్ వార్నింగ్ ఎందుకో తెలుసా..?

కే.ఎల్‌. రాహుల్‌కు గంభీర్ వార్నింగ్ ఎందుకో తెలుసా..?

by Anji
Ad

టీమిండియా వైస్ కెప్టెన్ రాహుల్‌కు మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు గౌత‌మ్ గంభీర్ వార్నింగ్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో జ‌ట్టుకు సార‌థిగా ఉన్నంత మాత్రాన భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీకి గ్యారంటీ ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ గంభీర్ చుర‌క‌లంటించాడు. ల‌క్నో టీమ్‌కు కావాల్సింది జ‌ట్టును న‌డిపించే బ్యాట‌ర్ కానీ.. బ్యాటింగ్ చేసే కెప్టెన్ కాద‌ని పేర్కొన్నాడు. ఈ రెండింటి మ‌ధ్య తేడాను రాహుల్ అర్థం చేసుకుంటాడ‌ని భావిస్తున్నాడు గంభీర్. ల‌క్నో జ‌ట్టుకు కే.ఎల్‌. రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

 


సార‌థి అనేవాడు మైదానంలో క‌చ్చితంగా రిస్క్ తీసుకోవాలి. కొన్నిసార్లు స‌రైన స‌మ‌యంలో రిస్క్ తీసుకోక‌పోతే విజ‌యం సాధిస్తామో లేదో చెప్ప‌లేం ఇప్పుడు ల‌క్నో జ‌ట్టుకు కీపింగ్ కోసం క్వింట‌న్ డికాక్ ఉన్నాడు. కీపింగ్ బాధ్య‌త‌లు రాహుల్ పై ఉండ‌బోవు స్వేచ్ఛ‌గా నిర్ణ‌యాలు తీసుకుంటూ బ్యాటింగ్, నాయ‌క‌త్వంపై దృష్టి పెట్టాలి. టీమిండియా భ‌విష్య‌త్ కెప్టెన్ అన‌డానికి మ‌ధ్య తేడా ఉంద‌న్న విష‌యాన్ని గుర్తుపెట్టుకోవాలి. త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి ఐపీఎల్ చ‌క్క‌టి వేదిక‌. కెప్టెన్‌గా ఎదిగేందుకు ఈ మెగా టోర్నీ తోడ్ప‌డుతుంది. అలాగ‌ని జాతీయ జ‌ట్టుకు కెప్టెన్ అవుతామ‌న్న గ్యారంటీ మాత్రం ఉండ‌దు.

Advertisement

Advertisement

జ‌ట్టు కూర్పు విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు గంభీర్ చెప్పాడు. ఆల్‌రౌండ‌ర్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకున్నాం. వేలం స‌మ‌యంలో ఇదే విష‌యాన్ని జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకాకు చెప్పాను. నా మాట‌కు ఆయ‌న ఎంతో విలువ‌నిచ్చారు. నా మాట‌కు అంత గౌరవం ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. అందువ‌ల్ల‌నే జేస‌న్ హోల్డ‌ర్ దీప‌క్ హుడా వంటి ఆల్‌రౌండ‌ర్లను జ‌ట్టులోకి తీసుకోగ‌లిగామ‌ని గంభీర్ పేర్కొన్నారు.

Also Read : ICC Rankings : మ‌రొక‌సారి నెంబ‌ర్ వ‌న్‌గా జ‌డేజా నెంబ‌ర్ వ‌న్

Visitors Are Also Reading