సినిమా నటుడు నిర్మాత బండ్ల గణేష్ వరుస కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల భీమ్లానాయక్ ప్రీరిలీజ్ ఫంక్షన్ విషయంలో త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయ్యింది. అయితే ఆ తరవాత ఆ ఆడియో తనది కాదంటూ వాయిస్ తనది కాదని చెప్పాడు.
Advertisement
ఇక రీసెంట్ గా చినజీయర్ స్వామి వివాదంలోను ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టు ఆయనతో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బండ్ల గణేష్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్థలం విషయంలో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రంగారెడ్డి జిల్లాలోని పుప్పాల గూడలోని ఓ హనుమాన్ టెంపుల్ భూమి తనది అంటూ బండ్ల గణేష్ తన అనుచరులతో వెళ్లారు.
Advertisement
దాంతో ఆలయ కమిటీతో బండ్ల గణేష్ కు గొడవ జరిగింది. ఇక ఆలయ కమిటి సభ్యులు ఆ భూమి తమదేనని చెబుతున్నారు. వందల సంవత్సరాల క్రితం నుండి అక్కడ హనుమాన్ టెంపుల్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం దాతల సహాయంతో 50లక్షల తో ప్రహరి గోడ నిర్మిస్తున్నామని చెప్పారు. అన్ని పత్రాలను చూపిస్తామని చెప్పినా బండ్ల గణేష్ అనుచరులతో వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.