ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇక దక్షిణాది రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు యత్నిస్తున్న విషయం విధితమే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం నేతలు తహతహలాడుతున్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాన్ని అనుసరించి ఆయనకు చెక్ పెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. దక్షిణాధిలో బీజేపీకి అనుకూలంగా మారుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికార పీఠం దక్కించుకోవాలని ఇప్పటి నుంచే తెగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 22న అనంతగిరి కొండల్లో 200 నేతలతో బీజేపీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
Also Read : Viral Video : ఆకాశంలో విన్యాసాలు చేసిన యువతి.. వీడియో చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!
Advertisement
సాధారణంగా ప్రతీ ఎన్నికలోనూ కేసీఆర్ అనుసరించే వ్యూహాన్ని బీజేపీ అమలు చేయాలని భావిస్తోంది. ఎన్నికల వరకు ఎదురు చూడకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టడం కేసీఆర్ వ్యూహం. 2018 ఎన్నికల్లో ఇదే వ్యూహంతో ప్రత్యర్థులపై పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీల అభ్యర్తులను ఖరారు చేసే లోపే కేసీఆర్ ఎన్నికల కదనరంగంలోకి దిగి దూసుకుపోయిన విషయం తెలిసిందే. మళ్లీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారనేది టాక్. ఈ తరుణంలో కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతుందని సమాచారం.
Advertisement
ఇప్పటికే 60 నియోజకవర్గం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. వారినే నియోజకవర్గం ఇన్‌చార్జీలుగా నియమించబోతున్నారని సమాచారం. దీంతో తాము ఎన్నికలకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చి టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందట. ఢిల్లీ నేతలు అమిత్ షా వంటి వారు తెలంగాణ బీజేపీ నేతలకు రోడ్డు మ్యాప్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టే బీజేపీ నాయకత్వం ముందుకు సాగనుందని తెలిసింది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి పోటీ ఇచ్చేందుకు మాస్టర్ ప్లాన్‌తో సిద్ధమవుతుందని అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో.. ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి.
Also Read : ఆకాశాన్నంటిన ఆర్ఆర్ఆర్ టికెట్ ధర..హైదరాబాద్లో ఒక్క టికెట్ రూ.5వేలు..!