Home » ఆకాశాన్నంటిన ఆర్ఆర్ఆర్ టికెట్ ధ‌ర‌..హైద‌రాబాద్లో ఒక్క టికెట్ రూ.5వేలు..!

ఆకాశాన్నంటిన ఆర్ఆర్ఆర్ టికెట్ ధ‌ర‌..హైద‌రాబాద్లో ఒక్క టికెట్ రూ.5వేలు..!

by AJAY
Ad

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఆర్ఆర్ఆర్ మేనియానే క‌నిపిస్తోంది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఇప్పుడు కండ్ల ముందుకు వ‌స్తుండ‌టంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌దుల్లేకుండా పోయాయి. ఎలాగైనా మొద‌టి రోజు ప్రీమియ‌ర్ షో చూడాల‌ని వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రీమియ‌ర్ షో టికెట్ ధర‌లు చూస్తే మాత్రం సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తున్నాయి.

rrr-movie-review

Advertisement

ఆర్జీవీ చెప్పిన‌ట్టుగా ఇష్టం ఉన్నోడు కొంటాడు లేద‌నుకున్నోడు లైట్ తీసుకుంటాడు అన్న‌ట్టు ఆర్ఆర్ఆర్ టికెట్ ధ‌ర‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ప్రీమియ‌ర్ టికెట్ ధ‌ర‌లు హైద‌రాబాద్ లోని థియేట‌ర్ ల‌లో 3 నుండి 5 వేల వ‌ర‌కూ ఉండ‌బోతున్నాయని టాక్ వినిపిస్తోంది. తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కే ప్రీమియ‌ర్ షోలు ప‌డ‌బోతున్న‌ట్టు సమాచారం. అయితే ఈ టికెట్ ధ‌ర‌లు చూస్తుంటే మాత్రం సామాన్యులు ప్రీమియ‌ర్ షో చూసే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు.

Advertisement

మ‌రోవైపు మార్నింగ్, మ్యాట్నీ షోల టికెట్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్నంటిన సంగ‌తి తెలిసిందే. మ‌ల్టీప్లెక్స్ ల‌లో ఒక్కో టికెట్ కు రూ.400 పైనే ఉండ‌గా సింగిల్ స్క్రీన్ ల‌లో రూ.200 పైనే క‌నిపిస్తోంది. టికెట్ ధ‌ర‌లు అధికంగా ఉండ‌టంతో సోష‌ల్ మీడియాలో టికెట్ రేట్ల పై ట్రోల్స్ వ‌స్తున్నాయి. టికెట్లు కొనాలంటే బైక్ అమ్ముకోవాలి..బంగారం అమ్ముకోవాలి అంటూ ట్రోల్స్ క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు టికెట్ ధ‌ర‌లు కాస్త త‌గ్గించాలంటూ కూడా అభిమానులు కోరుతున్నారు.

Visitors Are Also Reading