Home » ప్ర‌భాస్‌కు స‌ర్జ‌రీ.. తొంద‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల ఆకాంక్ష

ప్ర‌భాస్‌కు స‌ర్జ‌రీ.. తొంద‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానుల ఆకాంక్ష

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలైన త‌రువాత ఇంత‌వ‌ర‌కు ఒక్క‌సారి కూడా మీడియా ముందుకు రాలేదు. అయితే సినిమా పై మిశ్ర‌మ స్పంద‌న రావ‌డం వ‌ల్ల ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని సూచిస్తుంది. తాజాగా ప్రభాస్ స్పెయిన్‌కు వెళ్లారు. ప్రభాస్ స్వల్ప శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇటీవ‌ల స‌లార్ షూటింగ్ లో గాయ‌ప‌డ్డ ప్ర‌భాస్.. ఈ మేర‌కు స‌ర్జ‌రీ చేయించుకున్నారు. చిన్నపాటి ఆప‌రేష‌న్ అయినా డాక్ట‌ర్లు.. ప్ర‌భాస్‌ను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఇక ఈ విష‌యం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరో త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తున్నారు

Advertisement

Advertisement

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ‌క్క‌న్న ఇంట్లో గురువారం ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ముచ్చ‌టించారు. స‌ర‌దాగా సాగిన ఇంట‌ర్వ్యూలో ప్రీమియ‌ర్ షోకి ప్ర‌భాస్ వ‌స్తారా అని రాజ‌మౌళిని అడిగారు. స‌మాధానంగా ప్ర‌భాస్ క‌దిలి ప్రీమియ‌ర్‌కు రావ‌డం.. అది జ‌రిగే ప‌ని కాదు అని రాజమౌళి పేర్కొన్నారు. జ‌క్క‌న్న అన్న ఆ మాట ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. స‌ర్జ‌రీ జ‌రిగినందుకే ప్ర‌భాస్ రాడు అని రాజ‌మౌలి డాక్ట‌ర‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవ‌లే ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల అయింది. పిరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను దత్తించుకుంది. ఆ త‌రువాత ఆదిపురుష్‌, ప్రాజెక్ట్ కే స్పిరిట్ చిత్రాలు వ‌రుస‌లో ఉన్నాయి. వీటితో పాటు డైరెక్ట‌ర్ మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో ప్ర‌భాస్ న‌టించ‌నున్నారు.

Also Read : IPL 2022 : ఐపీఎల్‌లో అత్యధికంగా డకౌట్ అయింది ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading