మగ వాళ్లకు ఎలా బ్రతకాలో తెలియదు. ఇంట్లో ప్రశాంతత లేదు. ఎవరయితే ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారికి సరెండ్ అవుతుంటారు. ప్రేమ అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఆనందం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారికి కచ్చితంగా సరెండ్ అవుతారు. వేరే వేరే విధంగా ఆలోచిస్తేనే చెడు ఆలోచనలు వస్తాయి. భర్త భార్యపై ఎక్కువ ప్రేమ చూపిస్తే చాలు ఆమెకు ఎప్పటికీ చెడు ఆలోచనలు రావు.
Advertisement
భార్య భర్తపై కూడా అదేవిధంగా ఎక్కువ ప్రేమ చూపిస్తే చాలు అతనికి కూడా చెడు ఆలోచనలు రావు. భార్య నా భర్త నేను ఇంత ఇష్టపడినా తాను మాత్రం నా మీద ఎందుకు అంత ప్రేమ చూపించలేదు. నా భర్త నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నాడని భార్య ఆలోచిస్తుంటుంది. కానీ ఆ భర్తకు ఆమెలో నచ్చనిది ఏదో ఒకటి ఉంటుంది. దానిని చూసి ఆమెను దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా భార్య కూడా భర్తలో నచ్చని ఏదో ఒక గుణం ఉంటే దానిని మైండ్ లో పెట్టుకుని దూరం అవుతూ ఉంటారు.
Also Read : వైద్యులు చేతులెత్తేయడంతో ప్రాణంపోసిన తండ్రి..వీడియో వైరల్..!
Advertisement
విడిపోవడానికి కారణం ఒకటి స్వేచ్ఛ భావంతో బ్రతకాలనుకోవడం. ఇతరులను చూసి వారి లాగే బ్రతకాలనుకోవడం. భార్య దగ్గర సరిగ్గా మాట్లాడలేరు. భార్య ఎప్పుడు వస్తాడో నా భర్త అని ఎదురుచూస్తూ ఉంటుంది. భర్త ఉద్యోగానికి వెళ్లి అలిసి పోయి ఉంటాడని భార్య అర్థం చేసుకోకపోవడం. నా భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుందని, ఆమెతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి. బయటి ప్రస్టేషన్ ఆమెపై చూపించకూడదని భర్త ఆలోచించడు. ఇక ఈ మూడు కారణాలే వాళ్లు విడిపోవడానికి కారణం అవుతుంటాయి. దీని వల్ల విడాకులు తీసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం.. కొన్ని సందర్భాల్లో మొత్తానికి విడిపోవడం కూడా జరుగుతుంటాయి.
ఈ మూడు విషయాలు పక్కన పెడితే వ్యామోహం అనేది దాని వల్ల ప్రధానంగా జరుగుతాయి. నాలుగవది ఇంట్లో ఆహారం లభిస్తుంటే అతను హోటల్‌కు వెళ్లి తినాలనుకోడు. ఇంట్లో ఆహారం సమయానికి వండితే బయట తినాలనే ఆలోచన రాదు. ఎక్కడ ఏమి లభిస్తుందో అక్కడే వెళ్లి బ్రతుకుదామని జనాలు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. అందుకోసమే మన పూర్వికులు కొన్ని సాంప్రదాయాలు తీసుకొచ్చారు. కానీ వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. అందరి మెంటాలిటీ, ఆలోచనలు మారుతున్నాయి. ప్రతి మనిషికి స్వేచ్ఛ రావడమే అందుకు ప్రధాన కారణం. ఎక్కడైతే మంచిని కోరుకుంటామో అక్కడ కొంచెం చెడు ఉంటుందని ప్రకృతి నియమం. ముఖ్యంగా స్త్రీలు అయినా, పురుషులు అయినా ఒకరినొకరు సర్దుకొని పోవాలి. ఇక మూడవది ప్రధానమైనది ఇంట్లో జరిగే విషయాలను బహిరంగంగా చెప్పుకోకూడదు. ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచితే కచ్చితంగా వారి జీవితాలు చాలా బాగుంటాయి.
Also Read : జీహెచ్ఎంసీ బడ్జెట్ రూ.550 కోట్లు పెంపు