తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు అంటూ రోజుకొక తేదీ మారుస్తూ వస్తున్న ప్రకటనలతో విద్యార్థులందరూ అయోమయంలో పడుతున్నారు. వారి అనుమానాలకు చెక్ పెడుతూ ఇంటర్మీడియట్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించినది. 2021-22 విద్యాసంవత్సరానికి మే 06 నుంచి 23 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు స్పష్టం చేసింది.
Advertisement
Advertisement
మే 07 నుంచి 24 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. జేఈఈ మెయిన్ తేదీల మార్పుతో పరీక్ష తేదీలను సవరించినట్టు ఇండర్మీడియట్ బోర్డు తెలిపింది. విద్యార్థులందరూ పరీక్షలకు సిద్ధం కావాలని బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ సూచించారు. వేసవిలో పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు నీళ్లు ఎక్కువగా తాగుతూ సరైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పారు.
పరీక్షలకు 40 రోజులకు పైగా సమయం ఉన్నదని.. జాగ్రత్తగా రీడింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు. కరోనా, ఒమిక్రాన్, లాక్‌డౌన్ భయాలు ఇప్పుడు లేనందున ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఒమర్ జలీల్ సూచించారు.
Also Read : ఇంగ్లండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం