Home » కేసీఆర్ కు రేవంత్ బ‌హిరంగ లేఖ

కేసీఆర్ కు రేవంత్ బ‌హిరంగ లేఖ

by Anji
Ad

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప‌లు స‌మ‌స్య‌ల‌పై లేఖ‌లు రాస్తూ వ‌స్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మ‌రొక బ‌హిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి, ప‌త్తి రైతులు స‌మ‌స్య‌లు ప‌రిష్కారం గురించి లేఖ‌లో పేర్కొన్నారు. స‌రైన వ్య‌వ‌సాయ విధానం లేక‌పోవ‌డంతో రుణ‌, ప్ర‌ణాళిక‌, పంట‌ల కొనుగోళ్లు న‌కిలీ, క‌ల్తీ విత్త‌నాలు, పురుగు మందులు త‌దిత‌ర స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో రైతు అప్పుల పాలై దిక్కుతోచ‌ని స్థితితో ఉన్నార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో మిర్చి, ప‌త్తి రైతుల ప‌రిస్థితి న‌న్ను ఎంత‌గానో క‌లిచి వేసింద‌న్నారు.

Advertisement


ఇటీవ‌ల నేను మ‌హ‌బూబాబాద్ ప్రాంతంలో ప‌ర్య‌టించి వ‌చ్చి ఆ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తెచ్చే ప్ర‌య‌త్నం చేశాను. ఒక్క మ‌హ‌బూబాబాద్ జిల్లాలోనే రెండు నెల‌లో 20 మంది రైతులు చేసుకున్నారంటే.. ప‌రిస్తితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాల‌ని సూచించారు. ఇటీవ‌ల మాన‌వ హ‌క్కుల వేదిక‌, రైతు స్వరాజ్య వేదిక‌లు మ‌హ‌బూబాబాద్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి నివేదిక‌లు స‌మ‌ర్పించాయి.

Advertisement

రైతుల‌కు ఒక్క ఎక‌రాకు ల‌క్ష రూపాయ‌ల పెట్టుబ‌డి అవుతుంది. ప్ర‌తి రైతుకు రూ.6 నుంచి 12 లక్ష‌ల వ‌ర‌కు అప్పు ఉంద‌న్నారు. అప్పుల బాధ‌లు భ‌రించ‌లేక రైతులు మృతి చెందుతున్నార‌ని తెలిపారు. ల‌క్ష రూపాయ‌ల రుణ మాఫీ వెంట‌నే అమ‌లు చేయాల‌ని కోరారు. కౌలు రైతుల‌కు ఇచ్చే అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని.. క‌ల్తీ, న‌కిలీ పురుగు మందులు నివార‌ణ‌కు త‌గిన ప‌టిష్ట‌మైన కార్య‌చ‌ర‌ణ చేప‌ట్టాలని, రైతు వేదిక‌ల‌ను పున‌రుద్ధరించి వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ అధికారుల‌ను నియ‌మించి రైతుల‌ను ఆదుకోవాలి అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Visitors Are Also Reading