Home » 40 గ్రాముల‌ వెండితో త‌యారు చేసిన రూ.1000 కాయిన్‌ను మీరు చూశారా..?

40 గ్రాముల‌ వెండితో త‌యారు చేసిన రూ.1000 కాయిన్‌ను మీరు చూశారా..?

by Anji
Ad

పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి రూ.2వేల నోటును కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. వెయ్యి అనే మాట‌నే లేకుండా పోయిన త‌రుణంలో రూ.1000 నోటు తీసుకురాం అని చెప్పిన ఆర్‌బీఐ రూ.1000 బిళ్ల‌ను విడుద‌ల చేసింది. వాట్సాప్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. కొంత మంది ఇది అబ‌ద్దం అని, కొంత మంది నిజ‌మ‌ని ఇలా 2017 నుంచే సోష‌ల్ మీడియాలో రూ.100 కాయిన్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వాస్త‌వానికి ఆర్‌బీఐ 2010లోనే రూ.1000 కాయిన్ విడుద‌ల చేసిన‌ట్టు స‌మాచారం. త‌మిళ‌నాడు రాష్ట్రంలోని తంజావూరు బృహ‌దీశ్వ‌రాల‌యం నిర్మించి వెయ్యి సంవ‌త్స‌రాలు గ‌డిచిన సంద‌ర్భంగా వెయ్యి నాణాన్ని త‌యారు చేశారు.

Advertisement

Advertisement

అయితే తాజాగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ప‌ట్ట‌ణానికి చెందిన రుద్రంగి గంగాధ‌ర్ అనే వ్య‌క్తి ఆర్‌బీఐ ద్వారా వెయ్యి రూపాయ‌ల కాయిన్ తెప్పించుకున్నాడు. పూరిజ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు వెయ్యి ఏళ్లు గ‌డిచినా సంద‌ర్భంగా రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇటీవ‌ల పూరి జ‌గ‌న్నాథుని చిత్రంలో కాయిన్ ను విడుద‌ల చేసిన‌ది. ముఖ్యంగా వివిధ ర‌కాల కాలాల‌కు సంబంధించిన కాయిన్లు, నోట్లు సేక‌రించే అల‌వాటు గంగాధ‌ర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న‌ది.

300 ఏళ్ల నుంచి చ‌లామ‌ణిలో ఉన్నటువంటి నాణాల‌ను ఆయ‌న సేక‌రించారు. ఇందులో భాగంగానే రూ.8వేల విలువ చేసే డీడీని ఆర్‌బీఐ పేరిట చెల్లించాడు. ఆన్‌లైన్‌లో వెయ్యి రూపాయ‌ల కాయిన్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంతో పాటు 40 గ్రాముల వెండితో త‌యారు చేసిన కాయిన్ పంపించారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read :  పున‌రుద్ధ‌రించ‌బ‌డిన ప్ర‌పంచంలోని పొడ‌వైన కారు.. కొత్త‌గా స్విమ్మింగ్ పూల్‌, హెలిప్యాడ్‌

Visitors Are Also Reading