Home » సీనియ‌ర్ ఎన్టీఆర్ పిసినారితనం గురించి మీకు తెలుసా..?

సీనియ‌ర్ ఎన్టీఆర్ పిసినారితనం గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు నంద‌మూరి తార‌క‌రామారావు గురించి అంద‌రికీ తెలిసిన‌దే. ఎన్టీఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. భార‌త సినీ రంగంలో ఆయ‌న వేసిన ప్ర‌తీ అడుగు ఓ రికార్డును సృష్టించింది. ఆయ‌న ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు తెచ్చుకున్నా.. ఆయ‌న వెనుకే ఒక కామెంట్ నీడ‌లా వెంటాడింది. ఎన్టీఆర్ పిసినారి అని, అస‌లు ఇది ఎందుకు వ‌చ్చింది..? ఏ విధంగా బ‌య‌ట‌కు పొక్కింది..? అనే విష‌యాలు ఎంతో ఆస‌క్తిగా ఉన్నాయి.

Advertisement

ఎన్టీఆర్ హీరోగా న‌టించిన అడ‌వి రాముడు సినిమా షూటింగ్ కొన‌సాగుతోంది. ఈ సినిమాను చింత‌ప‌ల్లి అట‌వీ ప్రాంతానికి స‌మీపంలో చిత్రీక‌రిస్తున్నారు. అక్క‌డ చ‌లి విప‌రీతంగా ఉంది. దీనిని త‌ట్టుకునేందుకు చాలా ఇబ్బంది ప‌డ్డారు ఎన్టీఆర్. ఆయ‌న‌కు అల‌వాటు ఉన్న సిగ‌రెట్లు త‌ప్ప‌.. ఇంకా ఏవీ త‌న‌ను చ‌లి నుంచి ర‌క్షించ‌లేవేమో అని భావించి అన్న‌గారు జేబులో ఉన్న రెండు పెట్టేల‌ను ఖాళీ చేశారు. కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అప్ప‌టికే చ‌లి ముదురుతోంది.

Also Read :  ఎంత‌మంది అడ్డొచ్చినా మిమ్మిల్ని పూజిస్తూనే ఉంటా…బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్..!


ఈ స‌మ‌యంలోనే ఆయ‌న షూటింగ్‌లో ఉన్న ఓ బాయ్‌ని పిలిచి సిగ‌రేట్ పెట్టె తీసుకుర‌మ్మ‌ని రూ.10 ఇచ్చాడు. అప్ప‌ట్లో గోల్డ్ ఫేక్ కింగ్ సిగ‌రేట్ పెట్టె ధ‌ర 8 రూపాయ‌ల 75 పైస‌లు. సిగ‌రేట్ పెట్టే తీసుకొచ్చి అన్న‌గారి రూంలో పెట్టాడు ఆ బాయ్‌. అప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ షూటింగ్‌లో ఉన్నారు. ఆ త‌రువాత రూమ్‌కు వ‌చ్చి టేబుల్‌పై సిగ‌రేట్ పెట్టే ఉన్న‌ట్టు గ‌మ‌నించాడు. కానీ మిగిలిన చిల్ల‌ర మాత్రం క‌నిపించ‌లేదు.

Advertisement

వెంట‌నే ఎన్టీఆర్ త‌న మేనేజ‌ర్‌ను పిలిచి.. బాయ్ ఎక్క‌డా అని గద్దించారు. ఇంకేముంది ఏదో జ‌రిగిపోయింద‌ని.. భావించి ద‌ర్శ‌కుడు, నిర్మాత‌తో స‌హా అంద‌రూ అన్న‌గారి రూమ్‌వ‌ద్ద‌కు వ‌చ్చారు. వారి మ‌ధ్య‌లోంచి బాయ్ కూడా క‌న‌ప‌డ్డాడు. అన్న‌గారు ఆ బాయ్‌ను ద‌గ్గ‌ర‌కు పిలిచి చిల్ల‌ర ఏది అని అడిగాడు. వెంట‌నే జేబులో ఎక్క‌డో దాచుకున్న రూపాయి పావ‌లా తీసి అన్న‌గారి టేబుల్‌పై పెట్టి క్ష‌మాప‌ణ‌లు చెప్పి వెళ్లిపోయాడు.

ఈ ఘ‌ట‌న అడ‌విరాముడు సినిమా షూటింగ్‌లో తీవ్ర చ‌ర్చ‌గా మారింది. ముఖ్యంగా ఎన్టీఆర్ పిసినారి అంటూ ఆయ‌న వెనుక గుస‌గుస‌లాడుకునే వారు. అయితే త‌రువాత కాలంలో తాతినేని రామారావు సినిమా షూటింగ్‌లో ఉన్న‌ప్పుడు దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. చిల్ల‌ర నాకు పెద్ద విష‌యం కాదు. కానీ డ‌బ్బుల విలువ ముఖ్యం. మ‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే వారికి కూడా డ‌బ్బుల విలువ తెలియాలి. అందుకే అప్పుడు అప్పుడు అలా చేశాన‌ని చెప్పాడు. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వచ్చిన త‌రువాత కూడా పిసినారి అనే ముద్ర మాత్రం పోలేద‌ట‌.

ఎన్టీఆర్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ముఖ్యమంత్రి అయిన త‌రువాత కూడా జీతం కేవ‌లం రూపాయినే తీసుకునేవార‌ట‌. ముఖ్యంగా డ‌బ్బును వృధా చేసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డేవారు కాదు. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం డ‌బ్బు ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌ర‌మున్న‌ప్పుడు మాత్రం బాగా ఖ‌ర్చు చేసేవారు. మొత్తానికి ఎన్టీఆర్‌పై పిసినారి ముద్ర అప్ప‌ట్లో ఆస‌క్తిగానే మారింది. ఈ విష‌యాన్ని బాల‌య్య కూడా ప‌లు సంద‌ర్భాల్లో గుర్తుకు చేయ‌డం విశేషం.

Also Read :  మ‌హిళాదినోత్స‌వం ఫూల్స్‌డే అంటున్న‌ అన‌సూయ.. ఎందుకో తెలుసా..?

Visitors Are Also Reading