Telugu News » ఎంత‌మంది అడ్డొచ్చినా మిమ్మిల్ని పూజిస్తూనే ఉంటా…బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్..!

ఎంత‌మంది అడ్డొచ్చినా మిమ్మిల్ని పూజిస్తూనే ఉంటా…బండ్ల గ‌ణేష్ ట్వీట్ వైర‌ల్..!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ప్రాణ‌మిచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కేవ‌లం సాధార‌ణ ప్రేక్ష‌కుల్లో మాత్రమే కాకుండా సెల‌బ్రెటీల‌లోనూ ప‌వ‌న్ కు అభిమానులు ఉండ‌టం చెప్పుకోదగ్గ విష‌యం. అలా టాలీవుడ్ లోనే ప‌వ‌న్ అభిమానుల లిస్ట్ తీస్తే ముందుగా వినిపించే పేరు బండ్ల గ‌ణేష్. న‌టుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గ‌ణేష్ ఆ త‌ర‌వాత నిర్మాత‌గా మారారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తీన్ మార్ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హరించారు. కానీ ఈ సినిమా డిజాస్ట‌ర్ గా నిలిచింది.

Ads

ఆ త‌ర‌వాత బండ్ల గ‌ణేష్ కు ప‌వ‌న్ కల్యాణ్ గ‌బ్బ‌ర్ సింగ్ తో బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందించారు. అలా ఒక్క సినిమాతోనే బండ్ల గ‌ణేష్ టాలీవుడ్ లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ వ‌చ్చిందంటే బండ్ల గ‌ణేష్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. అలా సినిమాల కంటే స్పీచ్ ల‌తోనే బండ్ల గ‌ణేష్ ఎక్కువ మందికి ప‌రిచ‌యం అయ్యారు.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయ‌క్ ఆడియో ఫంక్ష‌న్ కు మాత్రం బండ్ల గ‌ణేష్ రాలేదు. దాంతో అభిమానులు అంతా నిరాష చెందారు. ఇదిలా ఉండ‌గా తాజాగా బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఓ ట్వీట్ చేశారు.

 

తీన్మార్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లోప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ను అభిమాని పోస్ట్ చేయ‌గా దానిని షేర్ చేసిన బండ్ల గ‌ణేష్…..ఈ జ‌న్మంతా నీ ప్రేమ‌లోనే మీ అభిమానంతోనే దారిలో ఎంత‌మంది వ‌చ్చినా మిమ్మ‌ల్ని పూజిస్తూనే ఉంటాడు బండ్ల గ‌ణేష్…అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ట్వీట్ వైర‌ల్ అవుతుండటంతో ఫ్యాన్స్ అంతా మీకు అడ్డు వ‌చ్చేది ఎవ‌ర‌న్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.


You may also like