బుల్లితెర నటి, జబర్దస్త్ యాంకర్, ఈ మధ్య సినిమాల్లో నటిస్తూ దూసుకెళ్లుతున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తొలుత నటిగానే పరిచయం అయింది. ఆ తరువాత యాంకర్ గా దూసుకెళ్లుతుంది అనసూయ. అదేవిధంగా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ.. తనదైన ముద్రను వేసుకుంది. పుష్ప, ఖిలాడి వంటి హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది అనసూయ.
Also Read : మన స్టార్ హీరోలు వారికి ఇష్టమైన వంటకాలు ఏవో తెలుసా ? బాలయ్యబాబు కి ఇష్టమైన వంట ఏదంటే ?
పలు సినిమాల్లో నటించడంతో పాటు ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఆమె పలు ఫొటోలను షేర్ చేస్తుంటుంది ఈ అందాల నటి. ఇదిలా ఉండగా.. తాజాగా అనసూయ ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ముఖ్యంగా ఇది ఉమెన్స్ డే కాదని.. ఒక ఫూల్స్‌డే అని రచ్చ చేసింది. ఉమెన్స్ డే రోజు మొత్తం మహిళలను గౌరవిస్తారు అని, ఆ తరువాత మగాళ్లు మృగాలవుతారనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలను అనసూయ చేసింది. అనసూయ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు అదే రీతిలో కౌంటర్ ఇస్తున్నారు. మహిళలను అవమానించారని ఫైర్ అవుతున్నారు.
Also Read : నేల మట్టమైన గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్..!