రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు 10 రోజుల నుంచి వార్ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న తరుణంలో రష్యా దళాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌లో పోరాడేందుకు దాదాపు 3వేల మంది అమెరికన్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని వాషింగ్టన్‌లోని కీవ్ రాయబార కార్యాలయం ప్రతినిధి తెలిపినట్టు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.
Also Read : “రాధేశ్యామ్” కథను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…!
Advertisement
ఉక్రెయిన్ ఎంబసీ ప్రతినిధి ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. రష్యా ఆక్రమణ శక్తులను నిరోధించడంలో సహాయపడే అంతర్జాతీయ బెటాలియన్‌లో ప్రజలు పని చేయాలని ఉక్రెయిన్ శక్తులను నిరోధించడంలో సాయపడే అంతర్జాతీయ బెటాలియన్‌లో ప్రజలు పని చేయాలని, ఉక్రెయిన్ చేసిన విజ్ఞప్తికి వాలంటీర్లు ప్రతిస్పందించారు. ఇతర దేశాల నుంచి చాలా మంది ముందుకొచ్చారు. జార్జియా, బెలారస్ వంటి ఇతర సోవియట్ అనంతర రాస్ట్రాల నుంచి చాలా మంది ముందుకొచ్చారని అధికారి వెల్లడించారు.
Advertisement
మార్చి 03న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ 16వేల మంది విదేశీ వాలంటీర్లతో కూడిన అంతర్జాతీయ దళం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత ఇది జరిగినది. ఉక్రెయిన్, యూరప్, ప్రపంచ రక్షణలోచేరాలని వారిని కోరినట్టు ఆయన చెప్పారు. మన సొంత స్వేచ్ఛ తప్ప మనం కోల్పోయేది ఏమది లేదని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 24 నుంచి రష్యా తన దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి ఉక్రెయిన్ అధికారులు యుద్ధంలో పోరాడటానికి విదేశీ వాలంటీర్లను కోరారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌లో యుద్ధానికి సైన్యాన్ని పంపడం లేదని.. కానీ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలను అందజేస్తున్నాయి. వెనుక ఉండి సాయం చేస్తున్నాయి.
Also Read : ఎంసెట్, ఈసెట్ మాత్రం జూన్‌లో.. మిగిలిన 5 ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..?