టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ శర్మ పనిని కూడా విరాట్ కోహ్లీ సులభతరం చేశాడు అని, అతను పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లను గెలవడంలో భారత బౌలింగ్ ఎంతో సాయ పడుతుందన్నారు. అదేవిధంగా రోహిత్ తన ట్రూప్‌లను మార్చడంలో కూడా మంచివాడు అని పేర్కొన్నాడు.
Advertisement
Also Read : “రాధేశ్యామ్” ట్రైలర్ లో హైలెట్ చేసిన ఈ భామను గుర్తుపట్టారా..!
కెప్టెన్ గా ఈ మ్యాచ్ రోహిత్‌కు తొలి టెస్ట్ అయితే కోహ్లీకి మాత్రం 100వ టెస్ట్ ముందు వైట్ బాల్ క్రికెట్‌తో పోల్చితే టెస్ట్ క్రికెట్‌లో మార్పు చాలా సులభమని గంభీర్ తన అభిప్రాయం వెల్లడించారు. ముఖ్యంగా భారత టెస్ట్ జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, చటేశ్వర్ పుజారాలను తొలగించి ఉండవచ్చు. కానీ వారికి తగిన ప్రత్యామ్నాయాలను కూడా కలిగి ఉందన్నారు.
Advertisement
ముఖ్యంగా నేను అలా అనుకోను. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది పెద్ద సవాల్ ఏమికాదు. పుజారా, రహానేల గురించి మాట్లాడితే.. హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ లాంటి అనుభవజ్క్షులైన ఆటగాళ్లున్నారు. అయ్యర్ టెస్ట్ క్రికెట్‌ను ఉజ్వలంగా ప్రారంభించాడని ప్రీ మ్యాచ్ షోలో గంభీర్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ భారత బౌలింగ్ ప్రమాణాలను మెరుగుపరిచిన ఘనత దక్కించుకున్నాడు. మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడు.
అన్నింటికంటే స్పెషల్ విశేషమేమిటంటే రోహిత్ తన కెప్టెన్సీని సొంతగడ్డపై ప్రారంభించనున్నాడు. విదేశాల్లో ఆడటం కంటే చాలా సులభం. అశ్విన్, జడేజా, షమీ, బుమ్రా ఉన్నప్పుడు అది కష్టం కాదు. బౌలర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బ్యాటర్లు మాత్రమే మ్యాచ్‌ను సెట్ చేస్తారు. కోహ్లీ భారత బౌలింగ్ బలాన్ని పెంపొందించుకున్నాడు. కాబట్టి రెడ్‌బాల్ క్రికెట్‌లో రోహిత్ కష్టపడాలని నేను అనుకోను. భారత్‌లో ఇది ఇంకా చాలా సులభం. తొలుత బ్యాటింగ్ చేస్తే మీరు గేమ్ సెట్ చేయగలరని మీకు తెలుసు అని గంభీర్ పేర్కొన్నాడు. టాస్ గెలిచిన రోహిత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతను కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 29 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
Also Read : ఆదిత్య 369 ఎస్పీ బాలు పుణ్యమా…? అసలు ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు…?