Home » ఆదిత్య 369 లో అసలు ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారంటే ?

ఆదిత్య 369 లో అసలు ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారంటే ?

by Venkatesh
Ad

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యంత భారీ విజయాలు సాధించిన సినిమాల్లో ఆదిత్య 369 సినిమా ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా కథ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య కెరీర్ చాలా స్పీడ్ గా ముందుకు వెళ్ళింది. విజయవంతమైన దర్శకులు ఎందరో బాలయ్య కోసం క్యూ కట్టారు. ఇక ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటీ అంటే…

Watch Aditya 369 Movie Online for Free Anytime | Aditya 369 1991 - MX Player

Advertisement

ఎస్. పి. బాలు… ఒకసారి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తో మాట్లాడుతూ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దగ్గరున్న టైం ట్రావెల్ కథ చెప్పడం… ఆ తర్వాత ఆ సినిమా చేయడానికి నిర్మాత ఒకే చెప్పడం… కృష్ణదేవరాయల కాలం అనగానే బాలకృష్ణ గుర్తుకు రావడం ఆయన వద్దకు వెళ్లి కథ చెప్పడం… బాలయ్య ఒకే చెప్పడంతో సినిమా ముందుకు వెళ్ళింది.

SP Balu Health Condition: Singer is 'extremely critical' in Chennai hospital | Chennai News - Times of India

ALso Read: త‌న ఆస్తుల చిట్టా బ‌య‌ట పెట్టిన శ్రీరెడ్డి…ఆ జిల్లాలో భారీగా భూములు..!

Advertisement

మొదట్లో సుమారు 1 కోటి 30 లక్షలు అవుతుందనుకున్న ఈ సినిమా బడ్జెట్ తర్వాత మరో 30 లక్షలు అదనంగా ఖర్చు చేసారు. ఇక ఈ సినిమా షూటింగ్ లో వేసిన సెట్లు, వాటికి కలిగిన ఆదరణ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ ఖర్చు చేయడానికి రెడీ గా ముందుకు వచ్చారు. దీనితో సినిమాకు కోటి 52 లక్షలు ఖర్చు అయింది. మొదట్లో ఈ సినిమాకు యుగపురుషుడు, ఆదిత్యుడు అనే పేర్లు అనుకున్నా సరే… ఆదిత్య అని పేరు పెట్టి టైం ట్రావెలింగ్ కాబట్టి 369 అనే ఆరోహణా క్రమంలోని అంకెలను జాయిన్ చేసారు.

VIJAYASHANTHI

VIJAYASHANTHI

జులై 18, 1991 న విడుదలైన ఈ చిత్రం మంచి లాభాలు తెచ్చి పెట్టింది. హీరోయిన్ గా ముందు విజయశాంతిని అనుకున్నారు. కాని ఆమె బిజీ గా ఉండటంతో మోహినికి ఛాన్స్ ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి సెట్స్ ను హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసారు. ఇక తర్వాత మద్రాసు లోని గోల్డెన్ బీచ్, విజయ వాహిని స్టూడియోస్ లో కొంత షూట్ చేసారు.

Also Read: స‌మంతా అలా అయి ఉంటే విరాట్ కోహ్లీలాగే ఉండేదేమో : ఫిట్‌నెస్ ట్రైన‌ర్

Visitors Are Also Reading