Home » “రాధేశ్యామ్” ట్రైల‌ర్ లో హైలెట్ చేసిన ఈ భామ‌ను గుర్తుప‌ట్టారా..!

“రాధేశ్యామ్” ట్రైల‌ర్ లో హైలెట్ చేసిన ఈ భామ‌ను గుర్తుప‌ట్టారా..!

by AJAY
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తాజాగా న‌టించిన చిత్రం రాధే శ్యామ్. ఈ సినిమాకు జిల్ సినిమా ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. పిరియాడిక‌ల్ ప్రేమ క‌థ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇప్ప‌టికే ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కావాల్సింది కానీ క‌రోనా కేసుల వ‌ల్ల విడుద‌ల వాయిదా ప‌డింది.  ఇదిలా ఉంటే ఈ సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ లు ఇప్ప‌టికే విడుద‌ల కాగా ప్రేక్షకుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Advertisement

 

భారీ గ్రాఫిక్స్ తో కూడిన స‌న్నివేశాలు సినిమాపై భారీ అంచనాల‌ను పెంచాయి. ఇక ఈ ట్రైల‌ర్ కు ఇప్ప‌టికే మిలియ‌న్స్ లో వ్యూవ్స్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ లో ఓ హీరోయిన్ ను మీరు గ‌మ‌నించారా..పూజా హెగ్డే కాకుండా ట్రైల‌ర్ లో మ‌రో హీరోయిన్ కూడా ఉంది.

Also Read: ఆస్ట్రేలియా దిగ్గ‌జ క్రికెట‌ర్ మృతి

Advertisement

అంతే కాకుండా ఆ హీరోయిన్ ఇప్ప‌టికే రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు కూడా వ‌చ్చింది. ఆ హీరోయిన్ పేరు రిద్ది కుమార్ కాగా ఈ ముద్దుగుమ్మ మొద‌ట హీరోయిన్ గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. కానీ హీరోయిన్ గా అనుకున్నమేర విజ‌యాలు అందుకోలేక‌పోయింది. దాంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అవ‌తారం ఎత్తింది. ఇప్పుడు ప్ర‌భాస్ తో పాన్ ఇండియా చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది.

ఇక రిద్ది కుమార్ న‌టించిన సినిమాల విష‌యానికి వ‌స్తే…రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించిన ల‌వ‌ర్ సినిమాతో మొద‌ట‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా అనుకున్న‌మేర హిట్ అవ్వ‌లేదు. ఈ సినిమా త‌ర‌వాత రిద్ది కుమార్ అన‌గ‌న‌గా ఓ ప్రేమ క‌థ అనే సినిమాలో న‌టించింది. ఈ చిత్రం కూడా అట్ట‌ర్ ఫ్లాప్ గా నిలిచింది. కానీ రాధే శ్యామ్ ట్రైల‌ర్ లో రిద్దిని హైలెట్ చేయ‌డంతో ఈ సినిమా ఆమె కెరీర్ ను మ‌లుపు తిప్పేలా ఉండ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read: ఆదిత్య 369 ఎస్పీ బాలు పుణ్యమా…? అసలు ముందు హీరోయిన్ గా ఎవరిని అనుకున్నారు…?

Visitors Are Also Reading