తన సీనియర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాదిరిగానే రోహిత్ శర్మకు కూడా లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం. తాజాగా లబోర్ఘిని ఊరస్‌ని కొనుగోలు చేశాడు. ఈ కారు కేవలం 3-4 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం గమనార్హం. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కారు టీమిండియా జెర్సీతో ఉండడం విశేషం. ఈ లగ్జరీ కారు 3.15 కోట్లు అని తెలుస్తోంది.
Also Read : దూకుడు సినిమాలో శ్రీను వైట్ల చెప్పిన ఎమ్మెల్యే గా ప్రకాష్ రాజ్ స్టోరీ ఎవరిదో తెలుసా ?
Advertisement
Advertisement
ఇది షేడ్ డార్క్ బ్లూ లేదా బ్లూ ఎలియోస్ రంగులో ఉంది. టీమిండియా జెర్సీ రంగు కూడా ఇదే కావడం విశేషం. బ్లూ కలర్ కారు కొనడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు రోహిత్ షెడ్‌లో BMW M5 రంగు కూడా నీలంగానే ఉంది. ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్, మెర్సిడెస్ GLS 350d, BMW5, BMWX3 కూడా రోహిత్ ఇంట్లో ఉన్నాయి. లంబోర్ఘిని 4.4 లీటర్ లర్బోచార్జ్డ్ వీ8 ఇంజిన్‌తో పని చేస్తుంది. దీని మోటార్ గరిష్టంగా 641 bhp శక్తిని, 850 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. దీని ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చారు. దీనికి ఆల్ వీల్ డ్రైవ్ ఇచ్చారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీలలో ఒకటిగా పేర్గాంచింది. ఇది గరిష్టంగా గంటకు 305 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
రోహిత్ కెప్టెన్ అయిన తరువాత ఏమ్యాచ్‌లో కూడా ఓడిపోకపోవడం గమనార్హం. న్యూజిలాండ్, వెస్టిండిస్, శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసి టీమిండియాను ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుగా మార్చాడు. ప్రస్తుతం మొహలీలో ఉన్న అతను శ్రీలంకతో తొలిటెస్ట్‌కు సిద్ధం అవుతున్నాడు. భారత స్టార్ క్రీడాకారుడు విరాట్ కోహ్లీకి ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం.
Also Read : విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… 100 వటెస్ట్ కు ఆడియన్స్ కు అనుమతి