ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ నొకోలా కేరికి వింత అనుభవం ఎదురు అయింది. దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్‌లో చిక్కుకుపోయారు. మ్యాచ్ మొదలయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాకపోవడంతో జట్టును ఆందోళన కలిగించింది. ఆ తరువాత జట్టుతో చేరిన కేరీ అసలు విషయం చెప్పడంతో నవ్వులు విరపూశాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల వన్డే ప్రపంచ కప్ మార్చి 04 నుంచి జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న ఆస్ట్రేలియా మహిళల జట్టు న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టింది.
Also Read : ఐపీఎల్ నుంచి ఆ స్టార్ ఓపెనర్ ఔట్.. అందుకే ఎస్ఆర్‌హెచ్ తీసుకోలేదా..?
Advertisement
వెస్టిండిస్‌తో వార్మప్ మ్యాచ్ కు సిద్ధం అయింది. అయితే మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి కేరీ అందుబాటులోకి రాలేదు. ఏమైంది అని జట్టు కాస్త కంగారు పడింది. అరగంట తరువాత కేరీ మైదానంలో దర్శనం ఇచ్చింది. విషయమేమిటని కేరీని ఆరా తీయగా.. టాయిలెట్‌కు వెళ్లాను. పని పూర్తి చేసుకుని బయటకు వద్దామంటే డోర్ లాక్ అవ్వడంతో బయటికి రాలేకపోయాను. దాదాపు 20 నిమిషాల పాటు టాయిలెట్‌లోనే ఉండిపోయాడు.
Advertisement
తరువాత సమాచారం అందుకున్న మా మేనేజర్ మాస్టర్ కీ సాయంతో డోర్ లాక్ తీశాడు. ఒక వేళ అది లేకుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో మ్యాచ్ ఆడేందుకు డోర్‌ను బద్దలు కొట్టైనా బయటకు వచ్చేదానిని అంటూ పేర్కొంది. రికార్డు స్థాయిలో ఏడో ప్రపంచ కప్ టైటిల్‌పై కన్నేసిన ఆస్ట్రేలియా మహిళల జట్ట వార్మప్ మ్యాచ్‌లో జోరు కనబరిచింది. టాస్ గెలిచిన విండిస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 259 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఉమెన్స్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి 90 పరుగులతో ఓటమి పాలైంది.
Also Read : Women’s World Cup 2022 : మార్చి 04 నుండే మహిళల సమరం.. 8 దేశాలు 31 మ్యాచ్‌లు