Home » Women’s World Cup 2022 : మార్చి 04 నుండే మ‌హిళ‌ల స‌మ‌రం.. 8 దేశాలు 31 మ్యాచ్‌లు

Women’s World Cup 2022 : మార్చి 04 నుండే మ‌హిళ‌ల స‌మ‌రం.. 8 దేశాలు 31 మ్యాచ్‌లు

by Anji
Ad

సీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ 2022 న్యూజిలాండ్‌లో మార్చి 04 నుంచి ప్రారంభం కానున్న‌ది. మొత్తం 8 దేశాలు ఇందులో పాల్గ‌న‌బోతున్నాయి. తొలి మ్యాచ్ న్యూజిలాండ్‌, వెస్టిండిస్ మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. అదే స‌మ‌యంలో బంగ్లాదేశ్ జ‌ట్టు రెండ‌వ మ్యాచ్‌లో ద‌క్షిణాప్రికాతో త‌ల‌ప‌డ‌నున్న‌ది. మార్చి 06న పాకిస్తాన్‌తో టీమిండియా త‌న తొలి మ్యాచ్ ప్ర‌పంచ క‌ప్ 2022 టోర్నీలో త‌న మ్యాచ్ ఆడ‌నుంది. ఈసారి జ‌రిగే ఈ మెగా టోర్నీలో ఐసీసీ ప‌లు మార్పులు చేసింది.

Also Read :  కారు కొన్న సంతోషం.. అంత‌లోనే క‌చ్చాబాదామ్ సింగ‌ర్ కు ప్ర‌మాదం

Advertisement

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్ 2022కు న్యూజిలాండ్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఏప్రిల్ 03 వ‌ర‌కు టోర్నీ కొన‌సాగుతుంది. 8 దేశాల జ‌ట్లు పాల్గొంటున్నాయి. భార‌త్‌, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, ఇంగ్లాండ్‌, వెస్టిండిస్‌, బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు ఈ మెగా టోర్నీలో త‌ల‌పడనున్నాయి. ఫైన‌ల్‌తో స‌హా మొత్తం 31 మ్యాచ్‌లు జ‌రుగ‌నున్నాయి. మార్చి 06న పాకిస్తాన్‌తో భార‌త్ త‌న ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నున్న‌ది. ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లు డే నైట్ ఉన్నాయి. మ్యాచ్ న్యూజిలాండ్‌లో ఉన్నందున భార‌త కాల‌మాన ప్ర‌కారం.. ఉద‌యం 6.30 నుండి భార‌త్ లో మ్యాచ్ చూడ‌వ‌చ్చు.

Advertisement

మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జ‌ట్టు రెండుసార్లు ఫైన‌ల్‌కు చేరినా టైటిల్ గెల‌వ‌లేక‌పోయింది. 2005లో ఆస్ట్రేలియా చేతిలో 2017 లో ఇంగ్లండ్ తో భార‌త్ ఓడిపోయింది. మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌ను ఇప్ప‌టివ‌ర‌కు మూడు జ‌ట్లు గెలుచుకున్నాయి. ఈ టోర్నీని అత్య‌ధిక సార్లు ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇంగ్లండ్ 4 సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచింది. న్యూజిలాండ్ ఓ సారి ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీని గెలుచుకుంది. ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే జ‌ట్టుకు గ‌త ఏడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు రెట్టింపు ప్రైజ్ మ‌నీ ల‌భిస్తుంది. ప్ర‌పంచ‌క‌ప్ విజేత జ‌ట్టుకు 1.32 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్లు ల‌భించ‌నుంది. 9 మంది ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి దిగ‌వ‌చ్చు. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. జ‌ట్టులో ఎక్కువ క‌రోనా కేసులు న‌మోదైతే.. 11 మంది ఆట‌గాళ్ల‌కు బ‌దులు 9 మంది కూడా మైదానంలోకి వెళ్ల‌వ‌చ్చ‌ని పేర్కొంది.

Also Read :  విజయ్ దేవ‌ర‌కొండ‌తో పెళ్లి….క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌…!

Visitors Are Also Reading