మనం వాడే ప్రతి నిత్యవసర వస్తువు కూడా కల్తీ అవుతుంది. ఏ వస్తువు ఎలా వస్తుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొన్ని కల్తీ కావడం వల్ల అది కల్తీదా..? లేక అసలుదా అని అనుమాన పడాల్సి కూడా వస్తుంది. మనం కల్తీ ఆహార పదార్థాల ముఠా దురాగతాలకు ఆవేదన చెందుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవును అన్నింటిలోనూ కల్తీ రాజ్యమేలుతుంది. డబ్బు సంపాదనే లక్ష్యంగా జనాన్ని నిండాముంచుతున్నారు. నకిలీ రాయుళ్లు ఫేక్ ఫుడ్ ఐటమ్స్ తో జనానికి కొత్త రోగాలను అంటగడుతున్నారు.
Also Read : BIGG BOSS OTT : హీరోయిన్ బిందు మాధవి గురించి ఎవరికీ తెలియని నిజాలు…!
Advertisement
Advertisement
కొద్ది రోజులుగా బ్రాండెడ్ పేరుతో నకిలీ సరుకులను అంటగడుతున్న దొంగల ముఠా బండారం బయటపెట్టింది. వివరాల్లోకెళ్లితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ పట్టణ శివారులో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందా నడుస్తోంది. ఈ నకిలీ కంపెనీని సిరాజ్ అహ్మద్ ముఠా నడిపిస్తోంది. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్లాన్‌తో దాడి చేశారు.
కోటి రూపాయల విలువ చేసే కుల్లిన అల్లం, వెల్లుల్లి సీజ్ చేశారు పోలీసులు. ఇక ఫ్యాకింగ్‌కు సిద్ధంగా ఉంచిన సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఇండ్ల మధ్యన ఏళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా నడుస్తోంది. కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ ను తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Also Read : విశాఖలో ప్రారంభమైన మిలన్ 2022.. హాజరు కానున్న సీఎం జగన్