ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేస్తున్న సమయంలో భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరందరూ ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ అక్కడ చిక్కుకుపోయినట్టు సమాచారం. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్ ఇండియావిమానం వెళ్లగా ఎయిర్ స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగి వచ్చింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని వారు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరుతున్నారు.
Advertisement
మరొకవైపు ఉక్రెయిన్లోని భారత ఎంబసీ అధికారులను సంప్రదించి విద్యార్థులను సురక్షితంగా స్వదేశానిఇక తరలించాలని తాము కూడా కోరినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. దీంతో సంబంధిత అధికారులు ఉక్రెయిన్ లోని తెలుగు విద్యార్థుల చిరునామాలను సేకరిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం తెలంగాణ ఎన్నారై సెల్ అధికారులకు వారు ఫోన్ చేసి సమాచారాన్ని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 350 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
Advertisement
Also Read : BHEEMLANAYAK : అడవితల్లి పాట పాడినందుకు ఇచ్చింది అంతేనా..?