ఇటీవల ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు పాల్పడ్డాడని టీమిండియా క్రికెటర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సాహాకు వీరేంద్ర సెహ్వాగ్ మరొకసారి మద్దతుగా నిలిచాడు. ఆ జర్నలిస్ట్ పేరును వెల్లడించాలని ట్విట్టర్ వేదికగా సాహాకు సూచించాడు. డియర్ వృద్ధి.. ఇతరులకు కీడు చేయని స్వభావం నీది కాదు అని నాకు తెలుసు. నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తివి. భవిష్యత్‌లో ఎవరికీ ఇలాంటి అనుభవాలు ఎదురు కాకుండా ఉండాలంటే అతని పేరు చెప్పాలి.
Also Read : అగ్గిపెట్టెలో పట్టే చీర.. యువ నేతన్న అద్భుత కళ
Advertisement
అందుకోసం గట్టిగా ఊపిరి పీల్చుకుని మరీ జర్నలిస్ట్ పేరు చెప్పేసేయ్ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. శ్రీలంకతో సిరీస్‌కు వృద్ధిమాన్ సాహాను పరిగణలోకి తీసుకోలేదు. ఈ తరుణంలో తనను రిటైర్‌మెంట్ గురించి ఆలోచించాలని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించాడని సాహా తెలిపాడు. అలాగే కొద్ది రోజుల కిందట ఇంటర్వ్యూ కోసం ఓ జర్నిలిస్ట్ ధోరణిలో సందేశాలను పంపాడని వృద్ధిమాన్ సాహా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. దీంతో సాహాకు సర్వత్రా మద్దతు లభించింది. దీనిపై విచారణ జరపాలని బీసీసీఐ నిర్ణయించింది.
Advertisement
అయితే ఆ జర్నలిస్ట్ పేరును బీసీసీఐ అడిగినా చెప్పను అని సాహా స్పష్టం చేశాడు. అతని కెరీర్‌కు నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. సాహాకు ఓ పాత్రికేయుడు బెదిరింపు ధోరణిలో సందేశం పంపడాన్ని భారత క్రికెటర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. సాహా తన ట్వీట్‌లో ఇలా రాసాడు. కెరీర్ ముగిసేంత వరకు ఎవరికీ హానీ కలిగించడం నా స్వభావం కాదు అని.. మనిషిగా అతని కుటుంబాన్ని చూస్తూ ఇలా చేయడం తప్పు. నేను ఇప్పుడే తన పేరును వెల్లడించను. అది మళ్లీ జరిగితే మాత్రం నేను ఆగను అంటూ పేర్కొన్నాడు.
Also Read : టీమిండియాకు మరొక ఎదురుదెబ్బ.. శ్రీలంక టూర్‌కు ఆ స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం