ఒక వైపు శ్రీలంక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాణిజ్యం, సైనిక బలంలో తక్కువే. మరొకవైపు బ్రిటన్ అగ్రరాజ్యంలో ఒకటి. శ్రీలంక కన్నా అన్నింటిలో మెరుగే. బ్రిటన్ చేసిన పనికి శ్రీలంక సరైన సమాధానం చెప్పింది. శ్రీలంకలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న వేలాది టన్నుల వ్యర్థాలతో నిండిన అనేక వందల కంటైనర్లను తిరిగి బ్రిటన్ కు పంపించింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యర్థాలు 2017, 2019 మధ్య కాలంలో శ్రీలంకకు పెద్ద ఎత్తున చేరాయి. వాటిలో ఉపయోగించిన పరుపులు, తివాచీలు, రగ్గులు మార్చురీల నుంచి శరీర భాగాలతో సహా ఆసుపత్రిల నుంచి బయో వేస్ట్ కూడా ఉందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
Also Read : ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్న విజయ్ రష్మిక…?
Advertisement
Advertisement
కంటైనర్ల నుంచి దుర్వాసన వస్తుందని అధికారులు వెల్లడించారు. సోమవారం కొలొంబో ఓడరేవులోని ఓడలో లోడ్ చేయబడిన కంటైనర్లలో దాదాపు 3వేల టన్నుల వ్యర్థాలున్నాయని శ్రీలంక అధికారులు గుర్తించారు. ఇలాంటి ప్రమాకర వాటిని దిగుమతి చేసుకోమని, అప్రమత్తంగా ఉండడమే కాక మళ్లీ జరగకుండా చూసుకుంటాం అని వివరణ ఇచ్చారు. అయితే కస్టమ్స్ ఓ స్థానిక సంస్థ బ్రిటన్ నుంచి వ్యర్థాలను దిగుమతి చేసుకుంటుందని పేర్కొంటుంది. కానీ కచ్చితమైన ఆధారాలు చూపించడంలో విఫలం చెందింది. ఈ తరుణంలో స్థానిక పర్యావరణ కార్యకర్త బృందం వ్యర్థాలను పంపిన వారికి తిరిగివ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీలంక బోర్డులో పిటిషన్ దాఖలు చేసింది.
శ్రీలంక అప్పిల్ కోర్టు 2020లో ఆ పిటిషన్‌ను సమర్థించింది. ఈ తరుణంలో శ్రీలంక ఆ వ్యర్థాలను తిరిగి బ్రిటన్‌కు పంపించింది. దౌత్య పరంగా శ్రీలంక నిర్ణయం పెద్ద అడుగుగానే చెప్పవచ్చు. శ్రీలంక మాదిరిగానే ఫిలిప్పిన్స్, ఇండోనేషియా, మలేషియా కూడా దిగుమతి అవుతున్న మందలాది చెత్త కంటైనర్‌లను గతంలో ఆయా దేశాలకు తిరిగి పంపించాయి. చమురు కొనుగోలు చేసేందుకు చిల్లిగవ్వ కూడా లేదని పేర్కొన్న శ్రీలంక బ్రిటన్‌కు దిమ్మతిరిగే సమాధానం చెప్పడం విశేషం.
Also Read : పాకిస్తాన్ సూపర్‌లీగ్ లో కోహ్లీ పోస్టర్ దర్శనం..!